క్రీడాభూమి

అశ్విన్ మాయాజాలంతో.. మళ్లీ ‘స్పిన్’డేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగ్‌పూర్, నవంబర్ 27: దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టెస్టు క్రికెట్ సిరీస్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన మూడో టెస్టులో భారత జట్టు శుక్రవారం 124 పరుగుల తేడాతో సఫారీలను మట్టికరిపించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి తన మాయాజాలాన్ని ప్రదర్శించి సఫారీల పతనాన్ని శాసించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 66 పరుగులకే 7 వికెట్లు కైవసం చేసుకుని కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసిన అశ్విన్ ఈ మ్యాచ్‌లో మొత్తం మీద 98 పరుగులిచ్చి 12 వికెట్లు సాధించగా, లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా 51 పరుగులిచ్చి మిగిలిన 3 వికెట్లు (రెండు ఇన్నింగ్స్‌లో 60 పరుగులకు 4 వికెట్లు) రాబట్టాడు. దీంతో 89.5 ఓవర్లలో 185 పరుగులకే ఆలౌటైన దక్షిణాఫ్రికా జట్టుకు రెండు రోజుల ముందే మరో భారీ ఓటమి తప్పలేదు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి స్వదేశంలో ఇది తొలి టెస్టు సిరీస్ విజయం కాగా, ఈ ఓటమితో సఫారీలు గత తొమ్మిదేళ్ల నుంచి విదేశాల్లో వరుసగా సాధించిన టెస్టు సిరీస్ విజయాల రికార్డుకు బ్రేక్ పడింది.
310 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు గురువారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 32 పరుగులు సాధించిన విషయం విదితమే. ఈ స్కోరుతో శుక్రవారం మూడో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా జట్టు టీమిండియా స్పినర్ల ధాటికి, ప్రత్యేకించి అశ్విన్ (29) జోరుకు మరోసారి బోల్తా పడింది. కెరీర్‌లో ప్రస్తుతం 31వ టెస్టు ఆడిన అశ్విన్ సఫారీలపై మరోసారి తనదైన మాయాజాలాన్ని ప్రదర్శించి నాలుగోసారి 10 వికెట్ల మైలురాయిని అధిగమించాడు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ జోరుకు బలైపోయిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్లలో ముగ్గురు ఎడమచేతి వాటం ఆటగాళ్లు (ఓపెనర్లు డీన్ ఎల్గర్, స్టియాన్ వాన్ జిల్, జెపి.డుమినీ) సహా మేటి బ్యాట్స్‌మన్ ఎబి.డివిలియర్స్ ఉన్నాడు. ముఖ్యంగా చివరి 19 బంతుల్లో అద్భుత ప్రదర్శన కనబర్చి 16 పరుగులకే నాలుగు వికెట్లు కైవసం చేసుకున్న అశ్విన్ దక్షిణాఫ్రికా చిట్టచివరి బ్యాట్స్‌మన్ మోర్న్ మోర్కెల్‌ను క్లీన్‌బౌల్డ్ చేసి దిగ్విజయంగా ఈ మ్యాచ్‌ను ముగించాడు.
అయితే అంతకుముందు వికెట్ల ముందు పాతుకుపోయి ఐదో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన దక్షిణాఫ్రికా కెప్టెన్ హషీమ్ ఆమ్లా (39), ఫఫ్ డుప్లెసిస్ (39)లను లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా పెవిలియన్‌కు చేర్చి ఈ మ్యాచ్‌ను కీలక మలుపు తిప్పాడు. ఆ తర్వాత జెపి.డుమినీ (19)తో పాటు వికెట్ కీపర్ డాన్ విలాస్ (12), కిగాసో రబడ (6), మోర్న్ మోర్కెల్ (4) వరుసగా అశ్విన్ బౌలింగ్‌లో నిష్క్రమించగా, సైమన్ హార్మర్ (8) నాటౌట్‌గా నిలిచాడు. దీంతో 89.5 ఓవర్లలో 185 పరుగులకే ఆలౌటైన దక్షిణాఫ్రికా జట్టు 124 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో అలరించి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన రవిచంద్రన్ అశ్విన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. ఇక ఈ సిరీస్‌లో చివరిదైన నాలుగో టెస్టు ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో డిసెంబర్ 3వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.

స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 215 ఆలౌట్
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 79 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్: 173 ఆలౌట్
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: డీన్ ఎల్గర్ ఎల్బీడబ్ల్యు (బి) అశ్విన్ 18, స్టియాన్ వాన్ జిల్ (సి) రోహిత్ శర్మ (బి) అశ్విన్ 5, ఇమ్రాన్ తాహిర్ ఎల్బీడబ్ల్యు (బి) అమిత్ మిశ్రా 8, హషీమ్ ఆమ్లా (సి) కోహ్లీ (బి) అమిత్ మిశ్రా 39, ఎబి.డివిలియర్స్ ఎల్బీడబ్ల్యు (బి) అశ్విన్ 9, ఫఫ్ డుప్లెసిస్ (బి) అమిత్ మిశ్రా 39, జెపి.డుమినీ ఎల్బీడబ్ల్యు (బి) అశ్విన్ 19, డాన్ విలాస్ (సి) వృద్ధిమాన్ సాహా (బి) అశ్విన్ 12, సైమన్ హార్మర్ నాటౌట్ 8, కిగాసో రబడ (సి) కోహ్లీ (బి) అశ్విన్ 6, మోర్న్ మోర్కెల్ (బి) అశ్విన్ 4, ఎక్స్‌ట్రాలు: (బైస్ 9, లెగ్‌బైస్ 5, నోబాల్స్ 4) 18,
మొత్తం: 89.5 ఓవర్లలో 185 ఆలౌట్.
వికెట్ల పతనం: 1-17, 2-29, 3-40, 4-58, 5-130, 6-135, 7-164, 8-167, 9-177, 10-185. బౌలింగ్: ఇశాంత్ శర్మ 15-6-20-0, రవిచంద్రన్ అశ్విన్ 29.5-7-66-7, రవీంద్ర జడేజా 25-12-34-0, అమిత్ మిశ్రా 20-2-51-3.