క్రీడాభూమి

అండర్-19 ట్రైసిరీస్ వనే్డ టోర్నీ ఫైనల్‌కు భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, నవంబర్ 27: అండర్-19 ట్రై సిరీస్ వనే్డ క్రికెట్ టోర్నమెంట్‌లో అప్రతిహతంగా జైత్రయాత్ర సాగిస్తున్న యువ భారత జట్టు మరోసారి అద్భుత ప్రదర్శనతో అలరించింది. కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్శిటీ కాంప్లెక్స్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 104 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్ జట్టును మట్టికరిపించి వరుసగా మరో విజయం సాధించిన భారత జట్టు ఈ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెంచరీతో రాణించిన ఓపెనర్ రిషబ్ పంత్ (118), బౌలింగ్‌లో మెరుపులు పెరిపించిన జీషన్ అన్సారీ (5/37) భారత జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. టాస్ గెలిచిన అఫ్గాన్ కెప్టెన్ ఇషానుల్లా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 4 పరుగులకే వికెట్ కీపర్ ఇశాన్ కిషన్ (0) వికెట్‌ను కోల్పోయింది. అయితే ఓపెనర్ రిషబ్ పంత్‌తో పాటు ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ విరాట్ సింగ్ క్రీజ్‌లో నిలదొక్కుకుని అఫ్గాన్ బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటించారు. దూకుడుగా ఆడిన పంత్‌కు విరాట్ చక్కటి సహకారాన్ని అందించడంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. చూడముచ్చటైన షాట్లతో అలరించిన వీరు రెండో వికెట్‌కు 186 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం 98 బంతుల్లో 4 సిక్సర్లు, మరో 14 ఫోర్ల సహాయంతో 118 పరుగులు సాధించిన పంత్ 32వ ఓవర్ చివర్లో నాసిర్ ఖాన్ వేసిన బంతిని ఎదుర్కోబోయి ముస్లిం వౌసాకు క్యాచ్ ఇవ్వగా, 94 బంతుల్లో ఒక సిక్సర్, మరో 7 ఫోర్ల సహాయంతో 71 పరుగులు సాధించిన విరాట్ సింగ్ కొద్దిసేపటికి రనౌటయ్యాడు. ఆ తర్వాత భారత జట్టు కెప్టెన్ రికీ భుయి క్రీజ్‌లో నిలదొక్కుకున్నప్పటికీ మిగిలిన బ్యాట్స్‌మన్ల నుంచి అతనికి సరైన సహకారం లభించలేదు. సర్‌ఫ్రాజ్ ఖాన్ (12), అన్మోల్‌ప్రీత్ సింగ్ (2) స్వల్పస్కోర్లకే వెనుదిరగ్గా 62 బంతుల్లో 2 సిక్సర్లు, మరో 4 ఫోర్ల సహాయంతో 50 పరుగులు సాధించిన రికీ భుయి చివరి ఓవర్‌లో మొహమ్మద్ జహీర్ వేసిన రెండో బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. చివర్లో ప్రదీప్తా ప్రామాణిక్ 4 పరుగులు చేసి రనౌటవగా, రాహుల్ బాథమ్ (6) నాటౌట్‌గా నిలిచాడు. దీంతో భారత జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 266 పరుగులు సాధించింది. అనంతరం 267 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన అఫ్గానిస్థాన్ జట్టుపై భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. ముఖ్యంగా జీషన్ అన్సారీ 37 పరుగులకే 5 వికెట్లు కైవసం చేసుకుని ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు. భారత బౌలర్ల జోరును ప్రతిఘటించడంలో అఫ్గాన్ బ్యాట్స్‌మన్లు ఘోరంగా విఫలమయ్యారు. నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ నవీద్ ఒబైద్ (63), లోయర్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ తారిఖ్ (26), సరుూద్ వహీదుల్లా (14), కెప్టెన్ ఇషానుల్లా (13) మినహా మిగిలిన వారెవరూ రెండంకెల స్కోర్లు రాబట్టలేకపోయారు. దీంతో 28 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైన అఫ్గాన్ జట్టు 104 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.