క్రీడాభూమి

చివరి రోజు ఆట రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్బేన్, సెప్టెంబర్ 18: భారత్ ‘ఎ’, ఆస్ట్రేలియా ‘ఎ’ జట్ల మధ్య నాలుగు రోజుల అనధికార టెస్టు డ్రాగా ముగిసింది. భారీ వర్షం కారణంగా అవుట్ ఫీల్డ్ మొత్తం బురదమయంగా మారడంతో ఆటను మొదలుపెట్టే అవకాశం లేకపోయింది. పలుమార్లు పరిస్థితిని సమీక్షించిన అంపైర్లు చివరికి మ్యాచ్‌ని డ్రాగా ప్రకటించారు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా 1-0 తేడాతో గెల్చుకుంది. చివరిదైన రెండో మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ‘ఎ’ 169 పరుగులకు ఆలౌట్‌కాగా, అందుకు సమాధానంగా ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 435 పరుగులు సాధించింది. అనంతరం భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించి, 60 ఓవర్లలో నాలుగు వికెట్లకు 158 పరుగులు చేసింది. అఖిల్ హెర్వాడ్కర్ 79, సంజూ శాంసన్ 34 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.