క్రీడాభూమి

ఆస్ట్రేలియా బ్యాటింగ్ కోచ్‌గా హిక్ నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, సెప్టెంబర్ 15: ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్‌మన్ గ్రేమ్ హిక్‌ను ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు స్పెషలిస్టు బ్యాటింగ్ కోచ్‌గా నియమించారు. ఇంగ్లాండ్ తరఫున 65 టెస్టులు, 120 వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడిన హిక్ ఇటీవల వెస్టిండీస్‌లో వనే్డ సిరీస్ ఆడిన ఆసీస్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా సేవలు అందించాడు. హిక్‌తో కలిసి పని చేయడం ఎంతో గొప్ప అనుభవమని, అంతర్జాతీయ క్రికెట్‌లో అపారమైన అనుభవం ఉన్న అతను బ్యాట్స్‌మెన్‌కు మార్గదర్శకుడవుతాడని ఆస్ట్రేలియా చీఫ్ కోచ్ డారెన్ లీమన్ అన్నాడు. విండీస్ టూర్‌లో అతని సేవలు ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పాడు. ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ, యాషెస్ సిరీస్, ఐసిసి ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీలు ఇంగ్లాండ్‌లో జరుగుతాయని, కాబట్టి హిక్ లాంటి అనుభవజ్ఞుడి అవసరం జట్టుకు ఎంతగానో ఉందని చెప్పాడు. కాగా, ఆసీస్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా సేవలు అందించే అవకాశం దక్కడం తన అదృష్టమని హిక్ ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. తన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని తెలిపాడు. దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ ఆరంభం నాటికి తాను జట్టుతో ఉంటానని చెప్పాడు.