క్రీడాభూమి

మకావు ఓపెన్ సెమీస్‌కు సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మకావు, నవంబర్ 27: మకావు ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ‘తెలుగు తేజం’ పివి.సింధు సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో ఇంతకుముందు రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన సింధు శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్‌లో చైనా క్రీడాకారిణి చెన్ యుఫెయిపై చెమటోడ్చి విజయం సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 12వ స్థానంలో కొనసాగుతున్న సింధు మూడు గేముల్లో ముగిసిన ఈ పోరులో 21-13, 18-21, 21-14 తేడాతో విజయం సాధించి టైటిల్ నిలబెట్టుకునేందుకు మరో రెండు అడుగుల దూరంలో నిలిచింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండుసార్లు కాంస్య పతకాలు సాధించిన సింధు ఫైనల్ బెర్తు కోసం జపాన్‌కు చెందిన సయాకా సాటోతో గానీ లేక అకానే యమగుచితో గానీ తలపడుతుంది. అయితే పురుషుల సింగిల్స్ విభాగంలో బి.సాయి ప్రణీత్, హెచ్‌ఎస్.ప్రణయ్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించడం భారత అభిమానులను నిరాశపర్చింది. ఏడవ సీడ్‌గా బరిలోకి దిగిన ప్రణయ్ 21-18, 19-21, 11-21 తేడాతో ఇండోనేషియా ఆటగాడు ఇసాన్ వౌలానా ముస్త్ఫొ చేతిలో ఓటమిపాలవగా, 15వ సీడ్‌గా బరిలోకి దిగిన ప్రణీత్ 16-21, 23-21, 13-21 తేడాతో మలేసియాకు చెందిన గోహ్ సూన్ హువత్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు.