క్రీడాభూమి

దీపా మాలిక్‌కు రజతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, సెప్టెంబర్ 12: రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. మహిళల షాట్‌పుట్ ఎఫ్-53 విభాగంలో దీపా మాలిక్ రజత పతకాన్ని సాధించి, భారత్ పతకాల సంఖ్యను మూడుకు చేర్చింది. పారాలింపిక్స్‌లో పతకాన్ని గెల్చుకున్న తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించింది. షాట్‌పుట్‌ను 4.61 మీటర్ల దూరానికి విసిరిన ఆమె రెండో స్థానంలో నిలవగా, బెహెరైన్‌కు చెందిన ఫాతిమ 4.76 మీటర్లతో స్వర్ణ పతకాన్ని సాధించింది. గ్రీస్ అథ్లెట్ దిమిత్రా కొరొకిడా 4.28 మీటర్లతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. రజతాన్ని కైవసం చేసుకున్న దీపా మాలిక్‌కు హర్యానా ప్రభుత్వ క్రీడా విధానంలో భాగంగా నాలుగు కోట్ల రూపాయల నగదు బహుమతి లభించనుంది.
కష్టాలకు ఎదురీత
దీపా మాలిక్ కష్టాలకు ఎదురీది, లక్ష్యాలను అందుకుంది. వెనె్నముక ట్యూమర్‌తో బాధపడుతున్న ఆమెకు మొత్తం 31 శస్త్ర చికిత్సలు జరిగాయి. నడుము నుంచి కాలి వరకూ జరిగిన ఆపరేషన్స్‌లో 183 కుట్లు పడ్డాయి. మంచానికే పరిమితం కావాల్సిన ఆమె క్రీడాకారిణిగా ఎదగడానికి అవిశ్రాంతంగా కృషి చేసింది. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో శ్రమించింది. షాట్‌పుట్‌లోనేగాక, జావెలిన్‌త్రో, స్విమ్మింగ్ విభాగాల్లోనూ మేటి పారా క్రీడాకారిణిగా గుర్తింపు సంపాదించింది. ఆసియా పారా చాంపియన్‌షిప్స్‌లో పతకాలు సాధించిన ఆమె పారాలింపిక్స్‌లోనూ సత్తా చాటింది. సమస్యలను అధిగమించి, అంతర్జాతీయ అథ్లెట్‌గా ఎదిగిన దీపా మాలిక్ జీవితం యువతకు మార్గదర్శకం కావాలి. కాగా, పురుషుల హైజంప్ ఈవెంట్‌లో మరియప్పన్ తంగవేలు స్వర్ణ పతకాన్ని సాధించగా, వరుణ్ సింగ్ భాటి కాంస్య పతకాన్ని అందుకున్న విషయం తెలిసిందే. రియో పారాలింపిక్స్‌లో దీపా మాలిక్ భారత్‌కు మూడో పతకాన్ని అందించింది.