క్రీడాభూమి

పాక్‌తో క్రికెట్ సిరీస్‌పై నిర్ణయం తీసుకోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వలెట్టా (మాల్టా), నవంబర్ 27: పాకిస్తాన్‌తో క్రికెట్ సిరీస్ నిర్వహణపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం స్పష్టం చేసింది. పాకిస్తాన్‌తో క్రికెట్ సంబంధాల పునరుద్ధరణకు బిసిసిఐ ప్రభుత్వ అనుమతిని కోరిన రెండు రోజులకు ప్రభుత్వం ఈ విషయం తెలియజేయడం గమనార్హం. కాగా, వచ్చే నెల శ్రీలంక లో భారత్‌తో క్రికెట్ సిరీస్ ఆడడానికి ప్రభుత్వంనుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) స్పష్టం చేసింది. ‘్భరత్-పాకిస్తాన్ క్రికెట్ సిరీస్‌పై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ మాల్టాలోని వలెట్టాలో చెప్పారు.
కామనె్వల్త్ దేశాధినేతల సమావేశాల్లో పాల్గొనడానికి వచ్చిన విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వెంట స్వరూప్ కూడా వచ్చారు. డిసెంబర్‌లో శ్రీలంకలో పాకిస్తాన్‌తో ఆడడానికి బిసిసిఐ కేంద్ర ప్రభుత్వం అనుమతిని కోరినట్లు బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ బుధవారం చెప్పడం తెలిసిందే. శ్రీలంకలో పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడడానికి బిసిసిఐ విదేశాంగ మంత్రిత్వ శాఖనుంచి అనుమతి పొందాల్సి ఉంది.
ప్రభుత్వం అనుమతి ఇచ్చింది
కరాచి: ఇదిలా ఉండగా, భారత్‌తో వచ్చే నెల శ్రీలంకలో నిర్వహించే క్రికెట్ సిరీస్‌కోసం ప్రభుత్వంనుంచి అనుమతి లభించినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) శుక్రవారం ధ్రువీకరించింది. ‘శ్రీలంకలో వచ్చే నెల పరిమిత ఓవర్ల సిరీస్ ఆడాలన్న ప్రతిపాదనకు ప్రధాని నవాజ్ షరీఫ్ ఆమోదం తెలిపారు’ అని పిసిబి అధికారి ఒకరు చెప్పారు. కొలంబోలో డిసెంబర్ 17నుంచి జనవరి 4 మధ్య కొలంబో, క్యాండీలలో 3 వన్‌డేలు, రెండు టి-20 మ్యాచ్‌లు ఆడడానికి తాత్కాలిక షెడ్యూల్‌ను ఇప్పటికే బిసిసిఐకి పంపించినట్లు పిసిబి అధికారి ఒకరు చెప్పారు. ఆస్ట్రేలియాలో సిరీస్‌కోసం శ్రీలంకనుంచి నేరుగా ఆస్ట్రేలియాకు వెళ్లే విధంగా సిరీస్ ఉండాలని బిసిసిఐ కోరుకొంటోందని కూడా ఆ అధికారి చెప్పాడు.