క్రీడాభూమి

లంకకు ఎదురుదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, డిసెంబర్ 25: న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న శ్రీలంక జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయంతో బాధపడుతున్న లీడింగ్ బౌలర్ లసిత్ మలింగ కివీస్‌తో తొలి రెండు అంతర్జాతీయ వనే్డ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఇటీవల శ్రీలంకలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు పర్యటన సందర్భంగా మలింగ మోకాలికి తీవ్ర గాయమైంది. ఈ గాయం నుంచి అతను ఇంకా కోలుకోకపోవడంతో కివీస్‌తో జరుగనున్న వనే్డ సిరీస్ నుంచి పూర్తిగా వైదొలగవచ్చని శ్రీలంక జట్టు అధికారులు శుక్రవారం తెలిపారు. ‘మలింగ వనే్డ మ్యాచ్‌లలో ఆడేందుకు రాలేదు. మోకాలి గాయంతో అతను ఇంకా ఇబ్బందులు పడుతున్నాడు. కివీస్‌తో వనే్డ, ట్వంటీ-20 సిరీస్‌ల మధ్య అతను మళ్లీ జట్టుకు అందుబాటులోకి వస్తాడా? లేదా? అనే విషయం ఎవరికీ అంతుపట్టకుండా ఉంది’ అని శ్రీలంక టీమ్ మేనేజర్ జెర్రీ వొవుటెరజ్ పేర్కొన్నాడు. కివీస్‌తో శనివారం క్రైస్ట్‌చర్చ్‌లో తొలి వనే్డలో తలపడనున్న శ్రీలంక జట్టులో మలింగకు బదులుగా థిసార పెరీరా చేరాడు.
కివీస్‌నూ వీడని గాయాలు
మరోవైపు న్యూజిలాండ్ జట్టును కూడా గాయాల సమస్య వేధిస్తోంది. ఇటీవల ప్రపంచ నెంబర్ వన్ టెస్టు బ్యాట్స్‌మన్ కిరీటాన్ని కైవసం చేసుకున్న కాన్ విలియమ్‌సన్ కుడి మోకాలి గాయంతో ఇబ్బందులు పడుతుండటంతో టెస్టు ఓపెనర్ టామ్ లాథమ్‌ను న్యూజిలాండ్ వనే్డ జట్టుకు ‘స్టాండ్‌బై’గా అందుబాటులో ఉంచారు. మోకాలి గాయంతో స్వల్పంగా ఇబ్బంది పడుతూనే ఆడుతున్న విలియమ్‌సన్ పూర్తిగా కోలుకోవాలని కాంక్షిస్తున్నామని, అందుకే టామ్ లాథమ్‌ను స్టాండ్‌బైగా ఎంపిక చేశామని న్యూజిలాండ్ బ్యాటింగ్ కోచ్ క్రెయిగ్ మెక్‌మిలన్ తెలిపాడు.