క్రీడాభూమి

భారత ఫుట్‌బాల్ కోచ్ కాన్‌స్టాంటైన్ పదవి పదిలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 25: జాతీయ కోచ్ స్టీఫెన్ కాన్‌స్టాంటైన్‌ను వచ్చే ఏడాది మార్చి వరకూ కొనసాగించాలని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఐఎఫ్‌ఎఫ్) నిర్ణయించింది. 2018 వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో భారత జట్టు పేలవమైన ఆటతో నిరాశ పరుస్తున్నప్పటికీ, అతనిపైనే సమాఖ్య నమ్మకం ఉంచడం విశేషం. వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో భారత జట్టు దారుణంగా విఫలమైందని సమాఖ్య ప్రధాన కార్యదర్శి కుశాల్ దాస్ బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు. అయితే, కాన్‌స్టాంటైన్‌ను వెంటనే మార్చాలన్న ఆలోచన ఏదీ తమకు లేదన్నాడు. వచ్చే ఏడాది మార్చి వరకూ అతని కాంట్రాక్టును పొడిగిస్తున్నట్టు చెప్పాడు. వచ్చే ఏడాది మార్చి తర్వాత మళ్లీ చర్చిస్థామని చెప్పాడు.

ఎన్‌సిఎ డైరెక్టర్‌గా
వెంగీ బాధ్యతలు

బెంగళూరు, నవంబర్ 25: జాతీయ క్రికెట్ అకాడెమీ (ఎన్‌సిఎ) డైరెక్టర్‌గా భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ బాధ్యతలు స్వీకరించాడు. ముంబయి క్రికెట్ సంఘం (ఎంసిఎ) ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న అతనికి గౌరవ సూచికగా ఎన్‌సిఎలో డైరెక్టర్ పదవిని ఇచ్చారు. ఈ సందర్భంగా వెంగీ మాట్లాడుతూ భారత క్రికెట్‌లో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పిన ఘనత ఎన్‌సిఎకు దక్కుతుందన్నాడు. ఈ పరంపరను కొనసాగించేందుకు తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నాడు. అక్కడ శిక్షణ పొందుతున్న క్రికెటర్లకు సలహాలు సూచనలు ఇస్తానని తెలిపాడు.

మకావూ ఓపెన్ బాడ్మింటన్
మూడో రౌండ్‌కు సింధు

మకావూ, నవంబర్ 24: మకావూ ఓపెన్ గ్రాండ్ ప్రీ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో స్టార్ క్రీడాకారిణి పివి సింధు మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. రెండో రౌండ్‌లో ఆమె కొరియాకు చెందిన ఐదో సీడ్ కిమ్ హ్యో మిన్‌ను 21-13, 22-20 తేడాతో ఓడించింది. తర్వాతి రౌండ్‌లో ఆమె ఇండోనేషియా క్రీడాకారిణి లిండవేని ఫనేత్రీతో తలపడుతుంది. మరో మ్యాచ్‌లో ఫనేత్రీ 21-11, 21-9 తేడాతో చెంగ్ చి యాను ఓడించింది. కాగా, పురుషుల సింగిల్స్‌లో సాయి ప్రణీత్ 21-11, 21-8 తేడాతో అర్టియోమ్ సవట్యుగిన్ (ఉజ్బెకిస్థాన్)పై గెలుపొందాడు. హెచ్‌ఎస్ ప్రణయ్ 21-19, 21-15 స్కోరుతో లిన్ చియా హ్యున్‌ను ఓడించి ముందంజ వేశాడు. అయితే, అజయ్ జయరామ్ పోరాటానికి రెండో రౌండ్‌లోనే తెరపడింది. అతనిపై లిన్ గుపూ (చైనా) 21-11, 21-17 ఆధిక్యంతో గెలిచాడు. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల, అశ్వినీ పొన్నప్ప పోరాటం కూడా ముగిసింది. వీరిపై యుకీ ఫకషిమా, సయాకా హిరోతా జోడీ 21-16, 21-15 స్కోరుతో గెలిచింది.