క్రీడాభూమి

ప్రతిపాదన వస్తే ఆలోచిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, నవంబర్ 25: పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్‌ఎల్) క్రికెట్ టోర్నమెంట్‌లో భారత ఆటగాళ్లు పాల్గొనడంపై ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) చైర్మన్ రాజీవ్ శుక్లా సూచన ప్రాయంగా ప్రకటన చేశాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) నుంచి అలాంటి ప్రతిపాదన ఏదైనా వస్తే ఆ అంశాన్ని ఆలోచిస్తామని చెప్పాడు. ఇప్పటి వరకూ అలాంటి ప్రతిపాదన ఏదీ తమకు రాలేదని ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శుక్లా చెప్పాడు. దుబాయ్, షార్జా వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 నుంచి మొదలయ్యే పిఎస్‌ఎల్‌లో కొంత మంది భారతీయులు ఆడితే బాగుంటుందని తాను అభిప్రాయపడుతున్నట్టు పిసిబి పాలక మండలి చైర్మన్ నజాం సేథీ చేసిన వ్యాఖ్యలపై శుక్లా స్పందిస్తూ, ఈ అంశంపై నిర్ణయాధికారం తమది కాదని చెప్పాడు. పిఎస్‌ఎల్ టోర్నీ చీఫ్‌గా కూడా వ్యవహరిస్తున్న సేథీ అభిప్రాయం తప్పుకాదని అన్నాడు. అయితే, ముందుగా పిసిబి నుంచి తమకు ప్రతిపాదన రావాలని, ఆతర్వాత విస్తృత స్థాయిలో చర్చించి, తగిన నిర్ణయం తీసుకుంటామని అన్నాడు. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) నిబంధనలను అనుసరించి విదేశాల్లో జరిగే ఏ రకమైన టి-20 క్రికెట్ టోర్నీల్లోనూ భారత ఆటగాళ్లు పాల్గొనే వీలులేదన్న విషయాన్ని అతను ప్రస్తావిస్తూ, పిసిబి కోరితే ప్రత్యేక కేసుగా పరిగణిస్తామని తెలిపాడు. వచ్చేనెల జరగాల్సిన పూర్తి స్థాయి ద్వైపాక్షిక సిరీస్ స్థానంలోనే పరిమిత ఓవర్ల సిరీస్ ఆడాలని భారత్, పాక్ క్రికెట్ బోర్డులు నిర్ణయించినట్టు సమాచారం. ఈ సిరీస్‌ను పాకిస్తాన్ హోం సిరీస్‌లు ఆడుతున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో కాకుండా శ్రీలంకలో ఆడాలని కూడా ఇరు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)కి చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్న బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్, పిసిబి అధ్యక్షుడు షహర్యార్ ఖాన్ ఒక అవగాహనకు వచ్చారని సమాచారం. అయితే, ఇప్పటి వరకూ అధికారులు ఎవరూ ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. ఒకవేళ సిరీస్‌పై తాము ఒక నిర్ణయానికి వచ్చినా, అందుకు తమతమ ప్రభుత్వాల నుంచి అనుమతి లభించాల్సిన అవసరం ఉందని ఇరువురు వేర్వేరు సందర్భాల్లో స్పష్టం చేశారు.

ప్రభుత్వం అనుమతించాలి
పాక్‌తో సిరీస్‌పై ఠాకూర్

న్యూఢిల్లీ, నవంబర్ 25: పాకిస్తాన్‌తో శ్రీలంకలో పరిమిత ఓవర్ల సిరీస్‌లో టీమిండియా ఆడేందుకు కేంద్రం అనుమతించాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ అన్నాడు. బుధవారం అతను విలేఖరులతో మాట్లాడుతూ ఈ సిరీస్‌కు శ్రీలంకను వేదికగా ఎంపిక చేసిన విషయాన్ని పరోక్షంగా ధ్రువీకరించాడు. అయితే, కేంద్రం నుంచి ఆమోద ముద్ర పడిన తర్వాతే వివరాలను ప్రకటించే అవకాశం ఉంటుందన్నాడు.
డబ్బు కోసం కాదు..
భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య లిమిటెడ్ ఓవర్ మ్యాచ్‌ల సిరీస్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సి) తెలిపింది. అయితే, డబ్బు కోసం తాము సంసిద్ధత వ్యక్తం చేయలేదని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. క్రికెట్ ప్రయోజనాలను కాపాడడమే తమ లక్ష్యమని పేర్కొంది.