క్రీడాభూమి

కాన్పూర్‌లో వసతి లభించక రంజీ మ్యాచ్ వేదిక మార్పు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్, నవంబర్ 20: ఉత్తరప్రదేశ్, వడోదర జట్ల మధ్య కాన్పూర్‌లో జరగాల్సిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌ను గ్రేటర్ నోయిడాకు మార్చారు. కాన్పూర్‌లో ఆటగాళ్ల వసతికి కొరత ఏర్పడటమే ఇందుకు ప్రధాన కారణం. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కావలసి ఉంది. అయితే ఆ సమయంలో పలు వివాహాలు జరుగుతుండటంతో కాన్పూర్‌లోని హోటళ్లన్నీ ముందుగానే బుక్ అయిపోయాయని, దీంతో ఈ మ్యాచ్ వేదికను మార్చాల్సి వచ్చిందని ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యుపిసిఎ) డైరెక్టర్ పిడి.పాథక్ తెలిపారు. ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలో పరిస్థితులను పరిశీలించేందుకు ఉత్తరప్రదేశ్ కోచ్ రిజ్వాన్ శంషాద్ అక్కడే ఉన్నారు. గ్రేటర్ నోయిడాలో హోటళ్లు, స్టేడియం చాలా బాగున్నాయని, అయితే అక్కడి పిచ్‌కి మరిన్ని మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. అయితే కాన్పూర్‌లోని గ్రీన్‌పార్క్ స్టేడియంలో ఈ నెల 23వ తేదీ నుంచి ఉత్తరప్రదేశ్, పంజాబ్ జట్ల మధ్య నిర్వహించతలపెట్టిన మ్యాచ్ షెడ్యూలు ప్రకారమే జరుగుతుంది.