జాతీయ వార్తలు

లోకసభ స్పీకర్‌గా ఓంబిర్లా ఏకగ్రీవ ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: 17వ లోకసభ స్పీకర్‌గా ఓంబిర్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయటంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయిందని ప్రొటెం స్పీకర్ వీరేందర్ కుమార్ ప్రకటించారు. సభా నాయకుడు, ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను స్పీకర్ స్థానం వద్దకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఓంబిర్లాకు సభ్యులు శుభాకాంక్షలు చెప్పారు. అంతకుముందు స్పీకర్ పదవికి ఓంబిర్లా పేరును ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించగా కేంద్రమంత్రులు రాజనాథ్‌సింగ్, అమిత్‌షాలతో పాటు పలువురు ప్రతిపాదించారు. కాగా స్పీకర్‌గా ఎన్నికైన ఓంబిర్లా రాజస్థాన్‌లోని కోటా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 2003లో ఆయన బీజేపీ రాజకీయాల్లో ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యే స్థాయికి వచ్చారు. ఈయన ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌షాలకు అత్యంత సన్నిహితుడు. మామూలుగా అయితే అధికారంలో ఉన్న పార్టీకి చెందిన సీనియర్ ఎంపీని లోక్‌సభ స్పీకర్ పదవికి ఎంపిక చేస్తారు. స్పీకర్ పదవిని సమర్థంగా నిర్వహించాలంటే సభ నియమ నిబంధనలు, రాజ్యాంగం బాగా తెలిసి ఉండాలి. ఈ కారణం చేతనే లోక్‌సభకు ఏడెనిమిదిసార్లు ఎన్నికైన సీనియర్ ఎంపీని ఈ పదవికి ఎంపిక చేస్తారు. ప్రొటెం స్పీకర్ ఇప్పటికే ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికైనందున ఆయనే్న స్పీకర్‌గా ఖాయం చేస్తారని భావించారు. అయితే బీజేపీ అధినాయకత్వం దీనికి భిన్నంగా లోక్‌సభకు రెండుసార్లు మాత్రమే ఎన్నికైన ఓం బిర్లాను స్పీకర్ పదవికి ఎంపిక చేసింది. మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ స్థానంలో ఓం బిర్లా లోక్‌సభ స్పీకర్ పదవిని చేపడతారు. ఇదిలా ఉంటే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రాజస్థాన్‌లోని మొత్తం 25 స్థానాలను గెలుచుకోవటం తెలిసిందే. ఇన్ని సీట్లిచ్చిన రాజస్థాన్‌కు సముచిత గుర్తింపు ఇవ్వాలనే ఆలోచనతోనే బీజేపీ అధినాయకత్వం ఓం బిర్లాను స్పీకర్ పదవికి ఎంపిక చేసిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఓం బిర్లా లోక్‌సభకు రాకముందు మూడుసార్లు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు.ఇదిలాఉంటే గతంలో లోక్‌సభకు రెండుసార్లు గెలిచిన తెలుగుదేశం నాయకుడు జీఎంసీ బాలయోగి, ఒకసారి గెలిచిన శివసేన నాయకుడు మనోహర్ జోషి స్పీకర్ పదవి చేపట్టటం తెలిసిందే.