క్రీడాభూమి

డోప్ టెస్టులను తగ్గించిన ‘నాడా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: సాధారణంగా జరిపే డోప్ పరీక్షలను ఇప్పుడు 25 శాతం తగ్గించినట్టు జాతీయ డోపింగ్ నిరోధక ఏజన్సీ (నాడా) ప్రకటించించింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ల్యాబ్‌లను అందుబాటులో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు నాడా డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ తెలిపాడు. అయితే, ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి వీలె న సంఖ్యలో అథ్లెట్లకు పరీక్షలను నిర్వహిస్తామని, అందు లో ఎలాంటి రాజీ ఉండదని ఆయన స్పష్టం చేశాడు. డోప్ స మస్య అత్యధికంగా ఉండే క్రీడా విభాగాలకు అధిక ప్రా ధాన్యం ఇస్తామని ఆయన అన్నాడు. చాలామంది డోప్ కం ట్రోల్ అధికారులు వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారని, కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున వారి సేవలు అత్యవసరం అవుతున్నాయని అగర్వాల్ అన్నాడు. అందుకే డోప్ టెస్టుల సంఖ్యను తగ్గించామని తెలిపాడు. శాంపిల్స్‌ను ఒకచోట నుంచి మరో చోటుకు తరలించడంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన వ్యాఖ్యానించాడు. అన్ని రకాల ముందు జాగ్రత్తలూ తీసుకుంటూ ఒ లింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్ల శాంపిల్స్‌ను పరీక్షిస్తామని అన్నాడు. అదే సమయంలో నాడాలో పనిచేస్తున్న ప్రతిఒక్కరికీ మాస్క్‌లు, శానిటైజర్లను అందజేస్తున్నామని అన్నాడు.