క్రీడాభూమి
అనుస్తుప్ అజేయ సెంచరీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కోల్‌కతా, ఫిబ్రవరి 29: అనుస్తుప్ మజుందార్ అజేయ శతకాన్ని నమోదు చేయడంతో, బెంగాల్‌తో శనివారం ప్రారంభమైన రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి కర్నాటక తొమ్మిది వికెట్లకు 275 పరుగులు చేసింది. షాబాజ్ అహ్మద్ 35, ఆకాష్ దీప్ 44 చొప్పున పరుగులు చేశారు. కర్నాటక బౌలర్లలో అభిమన్యు మిథున్ 65 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ప్రసిద్ధ్ కృష్ణ, రోనిత్ మోరే, కృష్ణప్ప గౌతం తలా రెండు వికెట్లు కూల్చారు.
సౌరాష్ట్ర 5/217
గుజరాత్‌తో రాజ్‌కోట్‌లో శనివారం ప్రారంభమైన మరో సెమీ ఫైనల్లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్ర మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తన తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 217 పరుగులు చేసింది. షెల్డన్ జాక్సన్ 69 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో, ఆ జట్టుకు భారీ స్కోరు సాధ్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. హార్విక్ దేశాయ్ 35, కిషన్ పర్మార్ 37, అవీ బారోత్ 27, విశ్వరాజ్ జడేజా 26 చొప్పున పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్ అర్జాన్ నాగ్వాస్‌వాలా 40 పరుగులిచ్చి మూడు వికెట్లు కూల్చాడు. అక్షర్ పటేల్‌కు రెండు వికెట్లు లభించాయి.
*చిత్రం... అనుస్తుప్ మజుందార్ అజేయ శతకం