క్రీడాభూమి

థాయ్‌ని ఓడించిన విండీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్త్, ఫిబ్రవరి 22: మహిళల టీ-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా శనివారం థాయలాండ్‌ను ఢీకొన్న వెస్టిండీస్ జట్టు 7 వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని సాధించింది. మొట్టమొదటి సారి టీ-20 ఇంటర్నేషనల్ ఆడిన థాయలాండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగి, 20 ఓవర్లలో 9 వికెట్లకు 78 పరుగులు చేసింది. నన్నపట్ కొన్చరోనెర్కాయ్ 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, నురెమోల్ చైవాయ్ 13 పరుగులు చేసింది. మిగతా వారు ఎవరూ డబుల్ డిజిట్స్‌కు చేరుకోలేదు. విండీస్ కెప్టెన్ స్ట్ఫోనీ టేలర్ 13 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టింది. బౌలింగ్ చేసిన మిగతా ఐదుగురు తలా ఒక్కోవికెట్‌ను తమ ఖాతాల్లో వేసుకున్నా రు. అత్యంత సాదాసీదా లక్ష్యాన్ని వెస్టిండీస్ 16.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయ ఛేదించింది. స్ట్ఫోనీ టేలర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. వికెట్‌కీపర్ షెమైన్ కాంప్ బెల్ అజేయంగా 25 పరుగులు సాధించింది. థా య్ బౌలర్లలో సొరయా లెతేకు ఒక వికెట్ లభిం చింది. మిగతా ఇద్దరు బ్యాట్స్‌మెన్ రనౌట్ అయ్యారు.