జాతీయ వార్తలు

11 రోజుల తర్వాత సోనియా డిశ్చార్జ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 14: పదకొండు రోజులపాటు ఆస్పత్రిలో ఎడం భుజం శస్త్ర చికిత్స, జ్వరానికి చికిత్స తీసుకున్న తర్వాత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం సర్ గంగారామ్ ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యారు. సోనియా గాంధీ అనారోగ్యం, ఎడంభుజం గాయంనుంచి బాగా కోలుకుంటున్నారని, ఆమె ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉందని ఆస్పత్రి డాక్టర్లు చెప్పారు. విశ్రాంతి తీసుకోవాలని, మందులు తీసుకోవడం కొనసాగించాలని ఆమెకు సలహా ఇచ్చినట్లు డాక్టర్లు తెలిపారు. సోనియా ఆరోగ్య పరిస్థితిని సమీక్షించడానికి వచ్చే వారం ఆమె మరోసారి ఆస్పత్రికి వస్తారని ఆస్పత్రి బోర్డ్ ఆఫ్ మేనేజిమెంట్ చైర్మన్ డి ఎస్ రాణా చెప్పారు. ఈ నెల 3న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో రోడ్డు షోలో పాల్గొంటున్న సమయంలో సోనియా గాంధీ హటాత్తుగా ఆస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. మొదట ఆర్మీ ఆస్పత్రిలో చేరిన ఆమెను ఆ తర్వాత సర్ గంగారామ్ ఆస్పత్రికి మార్చారు.

రోడ్ షో సందర్భంగా ఆమె ఎడం భుజానికి ఫ్రాక్చర్ కూడా అయింది.