జాతీయ వార్తలు

సోమ్‌నాథ్‌ భారతిపై పోలీసు కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించేందుకు తన మద్దతుదారులను ప్రేరేపించారని ఆరోపణలు రావడంతో దిల్లీ పోలీసులు ఆమ్‌ ఆద్మీ పార్టీ శాసన సభ్యుడు సోమ్‌నాథ్‌ భారతిపై కేసు నమోదు చేశారు. ఆయన మద్దతుదారులపై కూడా కేసు నమోదు చేశారు. దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ హాజరైన ఓ కార్యక్రమానికి వెళ్లిన తనతో సోమ్‌నాథ్‌ మద్దతుదారులు అసభ్యంగా ప్రవర్తించారని సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. సోమ్‌నాథ్‌పై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. భార్య లిపికా మిత్రా గృహహింస కేసు పెట్టడంతో ఆయనపై పోలీసులు గతంలో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.