క్రీడాభూమి

ఎన్ని కష్టాలు పడ్డానో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్
సిడ్నీ, డిసెంబర్ 24: ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు స్పిన్నర్‌గా ఎంపికై, బ్యాట్స్‌మన్‌గా స్థిరపడే క్రమంగా ఎన్నో కష్టాలు పడ్డానని, ప్రతి క్షణం పోరాటాలు చేశానని స్టీవెన్ స్మిత్ అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైన అతను ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అవార్డులు, ప్రత్యేక గౌరవాలు ఎంతో ఆసక్తిని కలిగిస్తాయని అన్నాడు. ఎంతో మంది ప్రతిభావంతులు రేసులో ఉన్నప్పటికీ, తనకు అవార్డు లభించడం ఎంతో ఆనందాన్నిస్తున్నదని అన్నాడు. ఈ స్థాయికి ఎదగడానికి తాను చేసిన కృషిని గుర్తు చేసుకున్నాడు. అరుదైన అవార్డులు లభించిన తర్వాత బాధ్యత మరింత పెరుగుతుందని అన్నాడు. ఒక మంచి క్రికెటర్‌గా గుర్తింపు సంపాదించాలంటే ప్రతి క్షణం శ్రమించాల్సిందేనని అన్నాడు. మైదానంలోకి దిగిన ప్రతిసారీ సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు సాధించి, జట్టును గెలిపించేందుకు కృషి చేస్తానని తెలిపాడు.