జాతీయ వార్తలు

తల్లీ, కొడుకుకు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమన్ల రద్దుకు ఢిల్లీ హైకోర్టు నో
హాజరుకమ్మంటూ సోనియా, రాహుల్‌కు ఆదేశం
నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక మలుపు
న్యూఢిల్లీ, డిసెంబర్ 7: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీకి ఢిల్లీ న్యాయస్థానంలో నిరాశ ఎదురైంది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపుఇవ్వాలన్న వారి అభ్యర్థనను ట్రయల్ కోర్టు తోసిపుచ్చింది. మంగళవారం నాటి వాయిదాకు హాజరుకావల్సిందేనని సోనియా, రాహుల్‌లకు న్యాయమూర్తి సునీల్ గౌర్ ఆదేశాలు జారీచేశారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో పాటు మరో కాంగ్రెస్ సీనియర్లు సుమన్ దూబే, మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, శామ్‌పిట్రోడా, యంగ్ ఇండియా(లి)లకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. అయితే వాయిదాకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని నిందితులంతా కోర్టును ఆశ్రయించగా న్యాయమూర్తి తిరస్కరించారు. పిటిషన్లను కొట్టివేస్తున్నట్టు జడ్జి ప్రకటించారు. సమన్లకు సంబంధించి 2014 ఆగస్టు 46న ఇచ్చిన తాత్కాలిక స్టేను పొడిగించాల్సిందిగా పిటిషనర్లు చేసుకున్న అభ్యర్థనను కోర్టు నిరాకరించింది. కాంగ్రెస్ నేతల తరఫున సీనియర్ అడ్వొకేట్ హరీశ్ రావల్ వాదించారు. గత ఏడాది ఆగస్టులో నిందితులు వ్యక్తిగత హాజరుపై కోర్టు తాత్కాలిక స్టే మంజూరు చేసిందని ఆయన గుర్తుచేసినా..న్యాయమూర్తి సునీల్ గౌర్ పొడిగించేది లేదని తేల్చిచెప్పారు. నేషనల్ హెరాల్డ్ నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్‌ను విచారించిన కోర్టు గత ఏడాది జనవరిలో నిందితులందరికీ సమన్లు జారీ చేసింది. 2014 ఆగస్టు 7న విచారణకు హాజరుకావాలని నిందితులను కోర్టు ఆదేశించిందని స్వామి తెలిపారు. దీంతో కాంగ్రెస్ నేతలు హైకోర్టుకు వెళ్లి సమన్లపై స్టే తెచ్చుకున్నారు.