క్రీడాభూమి

డిసెంబర్ 15 నుంచి లంకలో భారత్, పాక్ సిరీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 26: రోజుకో మలుపు తిరుగుతూ చాలాకాలంగా ఉత్కంఠ సృష్టిస్తున్న భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య సిరీస్ వచ్చేనెల 15 నుంచి శ్రీలంకలో జరగడం దాదాపు ఖాయమైంది. ఇటీవల దుబాయ్‌లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధ్యక్షుడు షహర్యార్ ఖాన్, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)కి చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు శశాంక్ మనోహర్ సమావేశమైనప్పుడు ఈ అంశంపై లాంఛనంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అనంతరం ఇరువురు తమతమ ప్రభుత్వాల అనుమతిని కోరుతూ లేఖలు రాశారు. పిసిబికి అక్కడి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. భారత సర్కారు బిసిసిఐ ప్రతిపాదనకు లాంఛనంగా ఆమోదం తెలిపినట్టు సమాచారం. ఒకటిరెండు రోజుల్లో దీనిపై స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గత ఏడాది కుదిరిన ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‌లో టీమిండియా పర్యటించాలి. అక్కడ భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయన్న భయంతో ప్రపంచ దేశాలేవీ రాకపోవడంతో, పాకిస్తాన్ తన హోం సిరీస్‌లకు తటస్థ వేదికగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)ని ఎంపిక చేసుకుంది. ఆరేడు సంవత్సరాలుగా అక్కడ హోం సిరీస్‌లు అడుతున్నది. అయితే, యుఎఇలో మ్యాచ్‌లకు బిసిసిఐ ససేమిరా అంది. అంతేగాక, భారత్‌లో ఆడాల్సిందిగా పిసిబిని ఆహ్వానించింది. కానీ, పిసిబి ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. దీనితో ప్రత్యామ్నాయ మార్గాలను అనే్వషించాల్సిన అవసరం ఏర్పడింది. బంగ్లాదేశ్, శ్రీలంక పేర్లు తొలుత వినిపించాయి. చివరికి శ్రీలంకకే మనోహర్, షహర్యార్ ఓటు వేసినట్టు తెలుస్తోంది.
కేంద్రం ఆమోదించాలి: శుక్లా
పాకిస్తాన్‌తో పూర్తి స్థాయి ద్వైపాక్షిక సిరీస్ స్థానంలోనే పరిమిత ఓవర్ల సిరీస్‌ను శ్రీలంకలో ఆడేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) చైర్మన్ రాజీవ్ శుక్లా అన్నాడు. అయితే, ఇందుకు కేంద్రం నుంచి అనుమతి లభించాల్సి ఉందని చెప్పాడు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, సమాధానం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపాడు. ఇప్పటికే బోర్డుకు లాంఛనంగా ఆమోదం లభించిందని వచ్చిన వార్తలపై శుక్లా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడిన తర్వాతే బిసిసిఐ ఈ అంశంపై పూర్తి వివరాలను వెల్లడిస్తుందని అంటున్నారు.
పిసిబికి ఊరట
అప్పుల ఊబిలో కూరుకుపోయి, నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పిసిబికి ఊరట లభించింది. భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ను శ్రీలంకలో ఆడేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి పిసిబికి గ్రీన్ సిగ్నల్ లభించడంతో కొండంత బరువు దిగిపోయినట్టు ఊపిరి పీల్చుకుంది. బోర్డుకు చీఫ్ ప్యాట్రన్ వ్యవహరిస్తున్న ప్రధాని నవాజ్ షరీఫ్ ముందు తాము ప్రతిపాదన ఉంచామని, వెంటనే ఆయన ఆమోదించారని పిసిబి అధ్యక్షుడు షహర్యార్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపాడు. వచ్చేనెల 15 నుంచి జనవరి రెండో వారం వరకు సిరీస్ జరుగుతుందని అన్నాడు. సిరీస్ ఆడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, బిసిసిఐ నుంచి సమాధానం కోసం ఇప్పుడు తాము ఎదురుచూస్తున్నామని తెలిపాడు.

‘హోం’ను సంప్రదించని బిసిసిఐ
న్యూఢిల్లీ, నవంబర్ 26: భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య శ్రీలంకలో డిసెంబర్ 15 నుంచి పరిమిత ఓవర్ల సిరీస్ ఖాయమనట్టు వార్తలు వస్తుండగా, కేంద్ర హోం శాఖను బిసిసిఐ ఇప్పటి వరకూ సంప్రదించలేదు. అయితే, పోటీలు భారత దేశంలో జరగడం లేదు కాబట్టి హోం శాఖ అనుమతి అవసరం ఉండదని బిసిసిఐ భావించి ఉండవచ్చు. అందులో నిజం కూడా ఉంది. సహజంగా స్వదేశంలో సిరీస్‌లు ఆడే సమయంలోనే హోం శాఖ ఆమోద ముద్ర అవసరం. విదేశాలకు వెళ్లాల్సి వస్తే విదేశీ మంత్రిత్వ శాఖను సంప్రదించాలి. ఈ కారణంగానే హోం శాఖను బిసిసిఐ సంప్రదించలేదని తెలుస్తున్నది.