క్రీడాభూమి
పిసిబికి ఊరట!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, నవంబర్ 24: భారత్‌తో స్వదేశంలోగానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లోగానీ ద్వైపాక్షిక సిరీస్ జరిగే అవకాశం లేకపోయినప్పటికీ, తటస్థ వేదికగా శ్రీలంకను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఎంపిక చేసే అవకాశం ఉందన్న వార్త పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి)కి ఊరటనిస్తోంది. సహజంగా వేదిక మారినప్పుడు ప్రసార హక్కులకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. గతంలో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలు తమ హక్కులను వదులుకోవడానికి ఇష్టపడవు. ఒకవేళ మార్పు అనివార్యమైతే, భారీగా నష్టపరిహారాన్ని కోరుతాయి. శ్రీలంక ఆటగాళ్లపై ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత పాక్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు ఏ దేశం ముందుకు రాకపోవడంతో, హోం సిరీస్‌లకు వేదికగా యుఎఇని పిసిబి ఎంపిక చేసుకుంది. అప్పటి నుంచి అక్కడే సిరీస్‌లు ఆడుతున్నది. ఇప్పుడు యుఎఇ కాకుండా వేదిక శ్రీలంకకు మారితే ప్రసార హక్కులపై ఇబ్బంది లేకపోవడం పిసిబి ఆనందానికి కారణమవుతున్నది. దుబాయ్‌కి చెందిన టెన్ స్పోర్ట్స్‌తో పిసిబి గతంలో ఒప్పందం కుదుర్చుకుంది. పాక్ ఆడే మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసే అవకాశం ఆ చానెల్‌కు మాత్రమే ఉంటుంది. ఒకవేళ శ్రీలంకలో జరిగే మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసార హక్కులు మరో సంస్థ పొందివుంటే సమస్య తలెత్తేది. కానీ, అక్కడ కూడా మ్యాచ్‌ల ప్రసార హక్కులు టెన్ స్పోర్ట్స్‌కే ఉన్నాయి. దీనితో ప్రత్యక్ష ప్రసారాల అంశం వల్ల ఎలాంటి సమస్య ఉండదని పిసిబి భావిస్తున్నది. అంతేగాక, యుఎఇలో కాకుండా మరో చోట సిరీస్ ఆడితే భారీ మొత్తాన్ని చెల్లిస్తామని బిసిసిఐ ఇప్పటికే ఇచ్చిన హామీ కూడా పిసిబి ఆనందానికి కారణమైంది. మొత్తానికి, ఒకవేళ శ్రీలంక సిరీస్‌కు బిసిసిఐ, భారత ప్రభుత్వం అంగీకరిస్తే, పిసిబికి ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు.