డైలీ సీరియల్

యువర్స్ లవింగ్లీ 25

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నాకు సిగ్గుగా వుంది బాబూ.. ఇంకోసారి చూద్దాంలే’’ అంటూ లేచింది.
వరుణ్ కూడా లేచాడు. లేచి ఆమె భుజాలని పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు.
నెమ్మదిగా ఆమె ముఖంమీదికి వంగాడు. అతడు చెయ్యబోతున్నదేమిటో అర్థమవ్వగానే గులాబీ రంగులో ఆరోగ్యంగా మెరుస్తున్న ఆమె పెదాలు క్షణకాలం చిగురుటాకుల్లా వణికాయి.
మరుక్షణమే అతడు ఆమె పెదవుల్ని తన పెదవులతో మూసేశాడు. ఆమె కళ్ళు మూసుకుంది.
‘‘ముద్దు’ యొక్క రుచి ఎలా వుంటుందో, అలా తన పద్దెనిమిదో యేట అతడివల్ల తెలుసుకుంది ఆమె. ఆ తరువాత వాళ్ళిద్దరూ కలుసుకున్నపుడల్లా, షేక్‌హ్యాండిచ్చుకోవడం అంత మామూలైపోయింది అది.
***
వరుణ్ సహచర్యంలో తర్వాత కాలం ఎలా తిరిగిపోతోందో కూడా హరితకి తెలిసేది కాదు. ప్రపంచం అంతా కొత్త కొత్త అందాలని సంతరించుకున్నట్టుగా కనిపించేది. అంతకుముందు రోజూ చేసే పనే అతడితో కలిసి చేస్తుంటే కొత్తగా అనిపించేది.. సినిమాలు, షికార్లు, ఐస్‌క్రీం పార్లర్‌లూ, ఎవరికీ తెలియకుండా ఇద్దరే వెళ్ళే పిక్నిక్‌లూ... వీటన్నిటిమధ్యా మొదటి సెమిస్టర్ గడిచిపోయింది. పెద్దగా చదవకపోయినా ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చేశాయి. రెండో సెమిస్టర్‌లో మాత్రం కొన్ని సబ్జెక్టులు బ్యాక్‌లాగ్ వుండిపోయాయి. వరుణ్ సలహాతో ఇంటి దగ్గర ఆ విషయం చెప్పకుండా మేనేజ్ చేసింది.
ఈమధ్యకాలంలో భరణి వరుణ్‌కి బెస్ట్‌ఫ్రెండ్ అయిపోయాడు. వాళ్ళిద్దరిమధ్యన ఏమైనా తగాదాలు వచ్చినా, మాకేదైనా సమస్య వచ్చినా వాళ్ళకి తలలో నాలుకలా ఉండేవాడు భరణి. అతడి ప్రోత్సాహమే లేకపోతే మేము తమ ‘స్నేహం’లో అంతముందుకు వెళ్ళేది కాదేమో అనిపిస్తుంది హరితకి. వరుణ్ అయితే ‘మన ప్రేమకి పెద్ద దిక్కు భరణి’ అనేవాడు.
ఒక రోజు వరుణ్ ‘‘నిన్నొకచోటికి తీసుకువెడతాను. సర్పైజ్’ అన్నాడు హరితతో.
‘‘ఎక్కడికి?’’ అని ఆమె అడిగినా చెప్పకుండా ఎక్కగానే బైక్‌ని వేగంగా ముందుకు ఉరికించాడు. కాలేజీ నుంచి బంజారా హిల్స్‌వైపు దూసుకునిపోయింది బైక్. పోష్ లొకాలిటీలోని ఒక హోటల్ తాలూకు పార్కింగ్‌లో బైక్ పార్క్ చేస్తుంటే ‘‘ఎక్కడికీ, హోటల్‌కా? నాకిప్పుడు ఆకలిగా లేదు’ అంది ఆమె.
‘‘మాట్లాడకుండా నా వెంట నడు’’ అన్నాడు వరుణ్ ఆజ్ఞాపిస్తున్నట్టుగా.
హరిత నవ్వుతూ అతడి వెంట నడిచింది. నిజానికి అతడి వెంట నరకానికి రమ్మన్నా వెళ్ళేటట్టు ఉంది ప్రస్తుతం ఆమె.
‘‘ప్యారడైజ్ ఆన్ వీల్స్’’ ఆరి వెలుగుతున్న రంగు రంగుల విద్యుత్ దీపాలతో తళతళా మరిసిపోతున్న బోర్డునీ, అక్కడ తిరుగుతున్న సీతాకోక చిలుకల్లాంటి అమ్మాయిలనీ, అబ్బాయిలనీ చూస్తూ ‘ఏమిటిది?’ అంది ఆశ్చర్యంగా.
‘‘నీకెప్పుడైనా డాన్స్ చేయాలనిపించిందా?’’ అన్నాడు వరుణ్.
అతడి ప్రశ్నకి సంభ్రమంగా చూసింది ఆమె. చిన్నప్పటినుంచీ ‘ఆడపిల్లవి’ అంటూ అనుక్షణం గుర్తుచేస్తూ. కట్టుబాట్లతో పెంచింది ఆమెని తల్లి సుమతి. గట్టిగా నవ్వితే తప్పు, మాట్లాడితే తప్పు, కూర్చుంటే తప్ప, నిల్చుంటే తప్పు, చివరకు కాలేజీకి జీన్స్‌పాంట్, కుర్త వేసుకురావడమీద కూడా ఇంట్లో చాలా గొడవయ్యేది.
చిన్నప్పటినంచీ సినిమాల్లో హీరోయిన్లని చూసి తనకి వాళ్ళలా డ్రెస్‌లు వేసుకోవాలనీ, నాట్యం చేయాలనీ అనిపించేది హరితకి. సరాదాగా ఎప్పుడైనా ఇంట్లో అలంకరించుకుని అద్దం ముందు డాన్స్ చేస్తున్నా సరే, సుమతి చూసి ‘‘ఏమిటా బోగం వేషాలు’’ అంటూ తిట్టిపోసేది. అలాంటిది ఒక్కసారిగా వరుణ్ అలా అడిగేసరికి ఆమె కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి.
‘‘నాకు తెలుసు. నీకు డాన్స్ చేయడమంటే ఇష్టమని. అందుకే ఇక్కడికి తీసుకుని వచ్చాను’’ అన్నాడు వరుణ్ నవ్వుతూ.
‘‘ఇదేమిటీ పబ్‌లా వుంది?’’ అంది హరిత.
‘‘పబ్బే.. కానీ నువ్వు అనుకుంటున్నట్టు పబ్ అంటే తాగి తందనాలాడ్డం కాదు. ఆటా, పాటా ఆనందం’ అంటూ ఆమె చేయి పట్టుకుని లోపలకి నడిచాడు. లోపల వాతావరణం చూసి తల తిరిగిపోయింది హరితకి. అక్కడంతా జంటలు జంటలుగా వయసులో వున్నా అమ్మాయిలూ అబ్బాయిలే. ఆమె అనుమానాన్ని గ్రహించినట్టుగా అన్నాడు వరుణ్. ‘‘ఇక్కడికి ప్రవేశం! ఒంటరిగా రావడం నిషిద్ధం!’’
‘‘నో ఇన్సిబిషన్స్.. కమాన్’’ అంటూ ఆమె చేయి పట్టుకుని డాన్స్ ఫ్లోర్ దగ్గరికి నడిపించాడు వరుణ్. అతడు గుసగుసగా చెవిలో ఏదో చెబుతుంటే అతడి చేయి పట్టుకుని నెమ్మదిగా కాళ్ళు కదిపింది ఆమె మ్యూజిక్కి అనుగుణంగా. వరుణ్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నట్టుగా చప్పట్లు కొట్టాడు.
కొద్దిసేపే బిడియం.. ఆ తరువాత హరిత అన్నీ మర్చిపోయిందామె. స్వేచ్ఛామయూరంలా నాట్యం చేసింది. ‘వండ్రఫుల్’, ‘మార్వలెస్’, ‘యూ ఆర్ లుకింగ్ గ్రేస్’ ఆమె డాన్స్ చూసి ఎవరో తెలియని వాళ్ళు కూడా వచ్చి అభినందిస్తుంటే గొప్పగా అనిపించింది ఆమెకి.
‘‘నీలో ఇంత టాలెంట్ వుందని నాకు తెలియదే’’ పరిచయమున్న గొంతులా వినిపించేసరికి ఆశ్చర్యంగా తల తిప్పి చూసిందామె, ఎదురుగా భరణి...
అతడ్ని అక్కడ చూసేసరికి కొద్దిగా భయం వేసింది. అతడు మాత్రం నవ్వుతూ చూసి ‘‘వండ్రఫుల్, చాలా బాగా డాన్స్ చేశావు నువ్వు’’ అన్నాడు. హరిత బిడియపడుతూ ‘్థంక్స్’ అంది.
ఆమె మనసుని చదువుతున్నట్టుగా అన్నాడు భరణి ‘కంగారు పడకండి. మిమ్మల్ని ఇక్కడ చూసినట్టుగా నేనెవరికీ చెప్పను. వయసులో వున్న పిల్లలంటే ఈ మాత్రం సరదా వుండాల్సిందే. ఇది మా పబ్బే. ఈ పబ్ మేనేజర్ నా ఫ్రెండ్. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడూ స్వేచ్ఛగా ఇక్కడికి రావచ్చు’’ అన్నాడు.
‘‘మనం ఇక్కడికి వచ్చినట్టు ఎవరైనా చూసి మా ఇంట్లో చెబుతారేమో వరుణ్’’ ఇంటికి వెళ్ళేదారిలో హరిత భయంగా అంది ఆమె వరుణ్‌తో.
వరుణ్ నవ్వి అన్నాడు ‘‘నీకా భయం అక్కర్లేదు. మీకు తెలిసిన వాళ్ళల్లో ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవరూ వుండరు. ఇక్కడికి వచ్చేవాళ్ళలో నీకు తెలిసిన వాళ్ళు వున్నా వాళ్ళు మీ ఇంట్లో చెప్పరు. ఎందుకంటే, వాళ్ళకి స్వేచ్ఛ విలువ బాగా తెలుస్తుంది కనుక’’.
అలా విలువైన ఆ ‘స్వేచ్ఛ’ని అనుభవిస్తూ జీవితాన్ని ‘ఎంజాయ్’ చేయడాన్ని అలవాటు చేసుకున్న హరితకి అనుకోని మార్పు లక్ష్మి మళ్లీ కనిపించడం.
****
‘‘హలో హరితా.. బావున్నావా?’’ సూపర్ బజార్లో కనిపించిన హరితని పలకరించింది లక్ష్మి. దాదాపు సంవత్సరం తరువాత కనిపించిన ఆమెని ఆశ్చర్యంగా చూసింది హరిత. ఇన్నాళ్ళు కనీసం ఆమె తనకి గుర్తుకు కూడా రానందుకు తనని తానే తిట్టుకుంది. మొదటిసారిలాగే ఆమెని చూసాక అప్పుడు కూడా గిల్టీగా అనిపించిందామెకి.
‘‘బావున్నారా?’’ అంటూ నవ్వుతూ పలకరించింది.
‘‘ఏంటసలు ఈమధ్య కనపడటం మానేశావు?’’ అడిగింది లక్ష్మి.
ఒకప్పుడామెతో పరిచయం పెంచుకుని స్నేహం చేయాలనుకుంది.

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ