క్రీడాభూమి

హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్‌కు ఆసీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు రెండో సెమీఫైనల్లో భారత్-బెల్జియం అమీతుమీ

రాయపూర్, డిసెంబర్ 4: ఇక్కడి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో జరుగుతున్న హాకీ ప్రపంచ లీగ్ టోర్నమెంట్‌లో శుక్రవారం హోరాహోరీగా జరిగిన తొలి సెమీఫైనల్‌లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా డిఫెండింగ్ చాంపియన్ నెదర్లాండ్స్‌ను 3-2 గోల్స్ తేడాతో చిత్తు చేసి ఫైనల్‌కు చేరుకుంది. ప్రపంచంలో టాప్ జట్లయిన ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ మధ్య జరిగిన పోటీ ఆద్యంతం అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఆస్ట్రేలియా తరఫున డైలన్ వదర్‌స్పూన్ (8వ నిమిషం), డేనియల్ బీలె (22వ నిమిషం), మాట్ గోడ్స్ (42వ నిమిషం) తలా ఒక గోల్ చేయగా, నెదర్లాండ్స్ తరఫున కాన్‌స్టాంటిన్ జోంకర్(29వ నిమిషం), మైక్రో ప్రుయిజర్( 33వ నిమిషం) చెరో గోల్ చేసారు. ఈ టోర్నమెంట్‌లో నెదర్లాండ్స్‌కు ఇది తొలి ఓటమి కావడం గమనార్హం. ఆస్ట్రేలియా ఆదినుంచి కూడా ప్రత్యర్థిపై దాడులు చేయడం మొదలుపెట్టి తొలి 25 నిమిషాల్లోనే రెండు గోల్స్ సాధించింది. అయితే రెండో అర్ధ్భాగంలో ఎదురుదాడులు ప్రారంభించిన నెదర్లాండ్స్ స్కోరును సమయం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. 42వ నిమిషంలో మార్క్ గోడ్స్ చేసిన అద్భుత గోల్‌తో ఆస్ట్రేలియా తిరిగి ఆధిక్యత సంపాదించింది. అ తర్వాత నెదర్లాండ్స్ గోలు చేయడానికి ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కాగా, శనివారం భారత్-బెల్జియంల మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్‌లో ఆస్ట్రేలియా టైటిల్ కోసం తలపడుతుంది. మరోవైపు నిలకడ లేమితో బాధపడుతున్న భారత్ శనివారం జరిగే రెండో సెమీఫైనల్‌లో ప్రమాదకరమైన జట్టుగా పేరుబడ్డ బెల్జియంను ఢీకొంటుంది. క్వార్టర్ ఫైనల్‌లో ప్రపంచ ర్యాకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్న గ్రేట్‌బ్రిటన్‌పై 2-1 తేడాతో అద్భుత విజయం సాదించడం ద్వారా సెమీ ఫైనల్లో స్థానం దక్కించుకున్న భారత్ మరోసారి అలాంటి ప్రతిభనే కనబరుస్తుందా? అని అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. టోర్నమెంటు ప్రారంభ మ్యాచ్‌లో అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో 0-3 గోల్స్ తేడాతో ఓడిపోయిన భారత్ ఆ తర్వాత ఒలింపిక్ చాంపియన్స్ జర్మనీతో జరిగిన మ్యాచ్‌ని డ్రా చేసుకోగలిగింది. ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ చేతిలో 1-3 గోల్స్ తేడాతో దారుణంగా పరాజయం పాలయింది. అయితే గురువారం గ్రేట్‌బ్రిటన్‌తో జరిగిన పోరులో మాత్రం అద్భుతంగా రాణించి అభిమానుల్లో కొత్త ఆశలను చిగురింపజేసింది.