జాతీయ వార్తలు

అన్నాడిఎంకె ఎంపి శశికళ పుష్పపై సస్పెన్షన్ వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: పార్టీ ప్రతిష్టను మంటగలిపేలా ప్రవర్తించినందుకు అన్నాడిఎంకె ఎంపీ శశికళ పుష్పను ఆ పార్టీ అధినేత్రి, తమిళనాడు సిఎం జయలలిత సస్పెన్షన్ వేటు వేశారు. డిఎంకె ఎంపీ తిరుచ్చి శివపై చేయి చేసుకున్నందుకు శశికళపై ఈ క్రమశిక్షణ చర్య తీసుకున్నారు. దిల్లీ ఎయిర్‌పోర్టులో శశికళ తనపై దౌర్జన్యం చేస్తూ నాలుగుసార్లు చెంపపై కొట్టారని డిఎంకె ఎంపీ తిరుచ్చి శివ ఆరోపించారు. ముఖ్యమంత్రి జయలలితపై, తమిళనాడు పోలీసులపై నోటికొచ్చినట్టు శివ మాట్లాడడంతో తాను చెంపపై కొట్టానని శశికళ ప్రకటించారు. ఈ ఘటనపై బహిరంగ ప్రకటనలు చేయవద్దని డిఎంకె, అన్నాడిఎంకె పార్టీలు ఆ ఎంపీలను హెచ్చరించాయి. కాగా, తనకు ప్రాణహాని ఉందని, రాజీనామా చేయాలంటూ సొంత పార్టీలో నుంచే ఒత్తిడి వస్తోందని, తనకు పూర్తి భద్రత కల్పించాలని శశికళ రాజ్యసభలో పేర్కొన్నారు. ఈ విషయమై రాజ్యసభ చైర్మన్‌కు లేఖ రాయాలంటూ డిప్యూటీ చైర్మన్ కురియన్ శశికళకు సలహా ఇచ్చారు.