జాతీయ వార్తలు

ఉద్దవ్ థాకరే సీఎం కావాలని కోరుకుంటున్నారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: మహారాష్ట్ర ప్రజలు, శివసేన సైనికులు ఉద్దవ్ థాకరే సీఎం కావాలని కోరుకుంటున్నారని శివసేన ఎంపీ సంజయ్‌రౌత్ అన్నారు. ఆయన శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నుంచి ఎటువంటి ప్రతిపాదనలు రాలేదని, ఇకపై ఆ పార్టీతో జట్టుకట్టేది లేదని స్పష్టంచేశారు. కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి ఏర్పాటుచేసే ప్రభుత్వంలో శివసేనకు చెందిన నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటాడని పేర్కొన్నారు. ఐదేళ్లపాటు శివసేనకు చెందిన నాయకుడే సీఎంగా ఉంటారని ఆయన అన్నారు. ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీల మహావికాస్ అఘాదీ సంకీర్ణ ప్రభుత్వంలో చిన్న పార్టీల పాత్రపై శుక్రవారం జరుగున్న సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.