వినమరుగైన

కార్యేషు రంభ - శయనేషు రొంప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అబ్బ! ఆపావ! ఇంకా నయం. మా బాస్ లేడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇంతసేపు ఇలా మాట్లాడుకొనేవాళ్ళం కాదు’’.
‘‘ఏమైనాడు’’
‘‘ఏం కాలేదు. వేరే బ్రాంచ్‌కి ఇన్స్‌పెక్షన్‌కు వెళ్ళాడు’’.
‘‘మరైతే రేపేం చేద్దాం’’
‘‘అయినా ఈడేల కోసం, ఈ డేస్‌లో ఇంతగా టెన్షన్ అవ్వాలా’’
‘‘టెన్షన్ ఏం అవసరంలేదు. మన ఫంక్షన్ బాగానే జరుగుతుంది. నువ్వింటికొచ్చాక ఆలోచించి నా ఐడియా చెప్తా!’’
‘‘గుడ్ అలా చేద్దాం!’’ అంటూ సెల్ ఆఫ్ చేసింది కాంతి. ఎలాగోలా సాయంత్రందాకా ఏదో పని చేశాననిపించుకొని హుషారుగా ఇంటిదారి పట్టింది.
***
కాంతి ఇల్లు చేరగానే, అప్పటికే ఇల్లు చేరిన కామేష్ ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఎవరితోనో ఏమిటో అర్థం కాలేదు. ఆ తరువాత తెలుసుకోవచ్చులేననుకొని, వంట పని పూర్తిచేయడానికి వంటింట్లోకెళ్లింది. ఆ రాత్రి భోజనాలు కాగానే ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని ఒకరి ముఖాలొకరు చూసుకొంటున్నారు.
‘‘కాంతి డోంట్ వర్రీ! నేను లీవ్ తీసుకొని..’’
‘‘తీసుకొని మరే గరల్‌ఫ్రెండ్‌తోనన్నా..’’
‘‘నిన్ను మించిన గరమ్ గరమ్ గరల్ ఫ్రెండ్ ఇంకెవరుంటారు’’
‘‘జోక్ చేశానంతే. నాకు మాత్రం తెలీదా నినే్న పిల్లా ఇష్టపడదని’’
‘‘అబ్బా! ఎందుకని’’’
‘‘ఓసారి రద్దీగా వున్న సిటీ బస్సులో ఓ అమ్మాయి నీ ప్రక్కనే నిల్చుని వుంటే, వెంటనే అక్కణ్ణుంచి అవతలికి వెళ్ళడానికి నువ్వెంత తంటాలు పడ్డావో నాకు తెలుసుగా!’’’
‘‘ఎవరా అమ్మాయి ఏమా కథ’’
‘‘చెప్పుకో చూద్దాం!’’
‘‘చెప్పు కాంతి గుర్తు రావడంలేదు’’
‘‘అవును. నువ్వా అమ్మాయి ముఖాన్ని కూడా చూడలేదుగా! నీకెలా గుర్తొస్తుంది’’
‘‘ఆ విషయం నీకెలా తెలిసింది’’
‘‘నేనే ఆ అమ్మాయిని’’
‘‘వాట్’’
‘‘అందుకే నిన్నూ, నీ శీలాన్నీ మెచ్చుకొని, మీ వాళ్ళనూ, మా వాళ్ళనూ ఒప్పించి నిన్ను నా మొగుణ్ణి చేసుకొని మురిసిపోతున్నా’’
‘‘మరి ఈ మాట ఇన్నాళ్ళూ నాకెందుకు చెప్పలేదు’’
‘‘మన తొలి మ్యారేజ్‌డే నాడు చెప్పాలనుకొన్నా!’’
‘‘గుడ్! సరే ఒక్క నిమిషం. నేను మీ బాస్‌తో మాట్లాడతాను. ఇందాక రింగ్ చేస్తే కాసేపాగి చెయ్యమన్నాడు’’ అంటూనే ఫోన్ డయల్ చేశాడు.
‘‘హలో! అనంతంగారూ!’’
‘‘ఆ! చెప్పండి!’’
‘‘మా కాంతికి జలుబు చేసింది. చెయ్యి పట్టుకుంటే కాలిపోతోంది. రేపు వ్యాధి సెలవు తీసుకొంటుందండీ. వైద్యుని లేఖతో ఎల్లుండి ఆఫీసుకొస్తుంది’’.
‘‘ఇంత మాత్రానికే వ్యాధి సెలవెందుకయ్యా! ఎప్పుడు చూసినా అందరి కళ్ళూ ఆవిడపైనే. బాగా దిష్టి తగులుంటుంది. కాసిని ఎండు మిరపకాయలు, కాసింత ఉప్పూ తీసుకొని ఇరుగుదిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి నీ దిష్టి అంటూ మూడుసార్లు మీ ఆవిడ తల చుట్టూ కుడినుంచి ఎడమకూ, ఎడమనుంచి కుడికీ తిప్పి, బొగ్గుల కుంపటి రాజేసి అందులో పడెయ్. బాగా చిటపటమని కోరు వాసన వస్తుంది. అంతే. దెబ్బకు జలుబూ గిలుబూ ఎగిరిపోయి, వెయ్యి కాంతుల బల్బులాగా ఆఫీసుకొచ్చేస్తుంది. కొత్తగా చేరినవాళ్ళకు, సెలవులు ఇప్పట్నుంచే ఇస్తే మా పైవాళ్ళు ఒప్పుకోరు. అదీ సంగతి’’ అంటూ ఫోన్ ఫెట్టేశాడు అనంతం.
‘‘కాంతీ! ఈ ఉద్యోగం మానెయ్. మనకేం తక్కువ. నేనెలాగూ చేస్తున్నాగా! ఊరికే కూర్చుంటే బోర్ కొడుతోందంటూ చేరావ్. ఆర్థికంగా ఇబ్బందులు లేనివాళ్ళంతా బోర్ కొడుతోందంటూ ఉద్యోగాల్లో చేరుతుంటే, ఇల్లుగడని నిరుద్యోగులకు ఉద్యోగాలెలా వస్తాయ్. నువ్వు ఉద్యోగం చేయడంవల్ల బ్యాంకు బాలెన్స్ పెరగవచ్చేమో కానీ, మన దాంపత్య జీవితానికీ, మనం సరదాగా గడపాలనుకొన్న సమయాలకు ఎంత బాధ పడాల్సి వస్తుందో చూస్తున్నావుగా! పగలంతా ఆఫీసులో చాకిరీతో అలసిపోయి ఇంట్లో పని చేసుకోవాలంటే ఎంత విసుగ్గా వుంటుంది. ప్లీజ్ నా మాట విను. అసలే కొత్త దంపతులం’’ అన్నాడు కామేష్ నీరసంగా.
‘‘ఆయనె్నందుకు కదిలించావ్’’ అంటూ వెంట వెంటనే నాలుగుసార్లు తుమ్మింది కాంతి.
‘‘మళ్ళీ రొంప మొదలైనట్లుందే. ఆ మధ్యనేగా వారం బాధపడ్డావ్. అందుకే ఈ ఉద్యోగమూ వద్దు. సెలవు కోసం ఇంత పోరాటం వద్దు’’.
‘‘ఇలాంటప్పుడు నువ్వనే ఆ ముద్దు పలుకులు వినిపించవా?’’
‘‘మరి ఉద్యోగం మానేస్తావా’’
‘‘ఎంత వున్నా ధనదాహంతో ఉద్యోగం చేయాల్సిందేనని ఒత్తిడి చేసే మొగుళ్ళూ, మగాళ్ళూ వున్న ఈ రోజుల్లో ఉద్యోగం వద్దు ఉన్నంతలో హాయిగా ఉందాం! అనే నీలాంటి మంచి మొగుడున్న నేనెంత అదృష్టవంతురాలిని. నీ మాట కాదంటానా!’’
‘‘అయితే విను. ఇన్నాళ్ళూ నువ్వు కార్యేషు రంభ, శయనేషు రొంప’’
‘‘ఇప్పుడు’’
‘‘ఇప్పుడే కాదు ఇంకెప్పుడూ కార్యేషు దాశి, శయనేషు రంభ’’
‘‘అయితే దిష్టి తీసెయ్యి’’
‘‘నీకింక దిష్టే తగలదు. నీపైన ఎవరి దృష్టి పడదుగా! నా దృష్టి తప్ప’’
‘‘అయితే నాకిక రాణివాసమేనన్నమాట’’ నవ్వుతూ అతనితో బెడ్‌రూమ్‌లోకి చేరుతుంది కాంతి.

-అయపోయంది
(ఆకాశవాణి సౌజన్యంతో...)

షణ్ముఖశ్రీ కథలు 8897853339