జాతీయ వార్తలు

సరైన పంథాలోనే ‘రఫాలే’ ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 24: భారత్‌కు రూ.60వేల కోట్ల విలువ గల రఫాలే యుద్ధ విమానాలను విక్రయించే ఒప్పందం సరయిన పంథాలో సాగుతోందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాన్ స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య అసాధారణ స్థాయిలో రానున్న 40ఏళ్ల పాటు పారిశ్రామిక, సాంకేతిక పరిజ్ఞానం రంగాల్లో ద్వైపాక్షిక సహకారానికి ఇది మార్గం సుగమం చేస్తుందని ఆయన అన్నారు. హోలాన్ భారత పర్యటన ఆదివారం చండీగఢ్ నుంచి మొదలయింది. ఫ్రాన్స్ నుంచి భారత్ 36 రఫాలే యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి సంబంధించిన తుది ఒప్పందంపై హోలాన్ రాక సందర్భంగా ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదురుతుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ గత సంవత్సరం ఏప్రిల్‌లో ఫ్రాన్స్‌లో పర్యటించిన సందర్భంగా ఈ రఫాలే యుద్ధ విమానాల ఒప్పందాన్ని ప్రకటించారు. అయితే ఇప్పుడు హోలాన్ భారత పర్యటన సందర్భంగా రఫాలే యుద్ధ విమానాలకు సంబంధించిన తుది ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేస్తాయా? అని పిటిఐ వార్తాసంస్థ ప్రతినిధి అడగ్గా, ఈ విషయంలో సరయిన పంథాలోనే సాగుతున్నామని, అయితే దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలపై ఒప్పందం కుదరడానికి కొంత సమయం పడుతుందని బదులిచ్చారు. ‘రక్షణ రంగంలో భారత్-ఫ్రాన్స్ మధ్య సహకారం ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగం. ఇది విశ్వాసం మీద ఆధారపడి ఉంది. మా రెండు దేశాల మధ్య చాలా పటిష్ఠమైన విశ్వాసం ఉంది’ అని హోలాన్ చెప్పారు. ఇటీవల పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రవాద దాడి, భారత్‌లో జరిగిన అనేక ఉగ్రవాద దాడులకు పాకిస్తాన్‌లో పథకాలు రూపొందించి అమలు చేయడంపై అడిగిన ఒక ప్రశ్నకు హోలాన్ సమాధానమిస్తూ ‘ఫ్రాన్స్ పఠాన్‌కోట్‌పై దాడిని తీవ్రంగా ఖండించింది. దోషులపై చర్య తీసుకోవాలని భారత్ కోరడం న్యాయసమ్మతమైనది’ అని బదులిచ్చారు. ‘్భరత్, ఫ్రాన్స్ ఒకే రకమైన సవాళ్లతో పోరాడుతున్నాయి. మతం ఆధారంగా పనిచేస్తున్నట్లు నటిస్తున్న హంతకులు మాపై దాడులు చేశారు. వారి నిజమైన లక్ష్యం విద్వేషాలను రెచ్చగొట్టడమే. మన ప్రజాస్వామిక విలువలను, జీవనవిధానాన్ని ధ్వంసం చేయాలని వారు కోరుకుంటున్నారు. భారత్, ఫ్రాన్స్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసి పోరాడాలనే దృఢసంకల్పాన్ని కలిగి ఉన్నాయి’ అని అన్నారు. తాను భారత పర్యటనకు రావడం ఇది రెండోసారని, భారత గణతంత్ర దినోత్సవంలో ముఖ్యఅతిథిగా రావడంపట్ల తాను గర్వపడుతున్నానని చెప్పారు. భారత్, ఫ్రాన్స్ సంబంధాలు ఉమ్మడి విలువలు, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, ప్రగతి మీద ఆధారపడి ఉన్నాయని అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఫ్రాన్స్ సైనిక సిబ్బంది కూడా భారత బలగాలతో కలిసి రాజ్‌పథ్‌లో జరిగే కవాతులో పాల్గొంటారని ఆయన చెప్పారు.