AADIVAVRAM - Others

రామాయణం.. మీరే డిటెక్టివ్ 13

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకో ప్రశ్న
దశావతారాల్లోని రెండో అవతారం ఏది?

విశ్వామిత్రుడు చెప్పిన గంగావతరణ వృత్తాంతాన్ని గురించి రామలక్ష్మణులు ముచ్చటించుకుంటూండగా ఆ రాత్రి గడిచింది. మర్నాడు రాముడు ఉదయపు కార్యక్రమాలని పూర్తి చేసుకుని విశ్వామిత్రుడితో చెప్పాడు.
‘పుణ్యనది ఐన ఈ గంగా నదిని దాటుదాం. మీ రాక తెలిసి ఋషులు మెత్తని చాపతో కప్పిన పడవని తెచ్చారు’
వారు దాని మీద ఉత్తర తీరం చేరి, అక్కడ నించి విశాలా నగరానికి చేరాక రాముడు అడిగాడు.
‘ఈ నగరాన్ని ఎవరు పాలిస్తున్నారు?’
‘కృత యుగంలో దితి, అదితిలకి ధార్మికులైన కొడుకులు ఉండేవారు. మనిషికి ముసలితనం, రోగాలు, చావు లేకుండా ఉండటానికి ఉపాయం ఏదా అని కొందరు మహాత్ములు ఓసారి ఆలోచించారు. పాల సముద్రాన్ని చిలికి అమృతాన్ని తీయాలనే ఆలోచన వారికి వచ్చింది. వారు వాసుకి అనే పాముని తాడుగా, వింధ్య పర్వతాన్ని కవ్వంగా చేసి చిలకసాగారు. అలా వెయ్యి సంవత్సరాలు చిలికాక తాడుగా ఉన్న వాసుకి విషాన్ని కక్కుతూ కోరలతో రాళ్లని కరవసాగింది. పాలసముద్రం లోంచి హాలాహలం పుట్టి ప్రపంచంలోని రాక్షసులని, మనుషులని కాల్చసాగింది. దేవతలు శివుడి దగ్గరకి వెళ్లి తమని ఆ విషం నించి రక్షించమని వేడుకున్నారు. శంఖచక్రాలతో శ్రీహరి అక్కడ ప్రత్యక్షమై శివుడితో, ‘దేవతలు అందరికన్నా ముందుగా నువ్వే పుట్టావు. కాబట్టి సముద్ర మధనంలో మొదటగా పుట్టిన విషాన్ని నువ్వే తీసుకోవాలి’ అని చెప్పి మాయం అయ్యాడు.
‘శివుడు దాన్ని అమృతంలా స్వీకరించాడు. తర్వాత మళ్లీ చిలకడం కొనసాగించారు. కవ్వంలా ఉన్న ఆ పర్వతం పాతాళంలోకి దిగిపోయింది. దాంతో దేవతలు విష్ణువుని దాన్ని పైకి ఎత్తి రక్షించమని కోరారు. దాంతో విష్ణువు తాబేలు రూపం ధరించి ఆ పర్వతాన్ని తన వీపు మీద మోసాడు. ఇలా వంద సంవత్సరాలు చిలికాక సముద్రంలోంచి దండ కమండలాలతో ధన్వంతరి, తేజస్సు గల అప్సరసా స్ర్తిలు బయటికి వచ్చారు. పాలని చిలకగా అందులోంచి పుట్టడంతో ఆ స్ర్తిలకి అప్సరసలు అనే పేరు వచ్చింది. వారికి లెక్కకి అందని పరిచారికలు కూడా పుట్టారు. దేవతలు, రాక్షసుల్లో ఎవరూ వారిని పెళ్లి చేసుకోకపోవడంతో వారు వేశ్యలు అయ్యారు.
‘తర్వాత వరుణుడి కూతురు, సురకి (మద్యానికి) దేవత అయిన వారుణి తనని ఎవరు స్వీకరిస్తారా అని వెదుకుతూ బయటకి వచ్చింది. దితి కొడుకులు దైత్యులు సురని (మద్యాన్ని) స్వీకరించలేదు. దాంతో వారు అసురులుగా పిలవబడుతున్నారు. అదితి కొడుకులు మాత్రం వారుణిని స్వీకరించడంతో వారికి సురులు అనే పేరు వచ్చింది. తర్వాత ఉచ్ఛైశ్రవము అనే మేలుజాతి గుర్రం, కౌస్త్భుం అనే మాణిక్యం, చంద్రుడు, లక్ష్మీదేవి పుట్టాక చివరగా అమృతం పుట్టింది. అమృతం కోసం జరిగిన యుద్ధంలో దేవతలు దైత్యులని చంపారు. దాని కోసం దైత్యులు, రాక్షసులు ఓవైపు, దేవతలు మరోవైపు చేరి యుద్ధం చేస్తూండగా విష్ణువు మాయామోహిని రూపాన్ని ధరించి దైత్యుల నించి అమృతాన్ని దొంగిలించి, తనని ఎదిరించిన కొందరు దైత్యులుని చంపేశాడు. ఆ తర్వాత దేవేంద్రుడు చారణులు, ఋషులు గల లోకాలని పాలించసాగాడు.
తన కొడుకులు అంతా చంపబడటంతో మరీచుడి కొడుకైన తన భర్తతో దితి దుఃఖంగా చెప్పింది.
‘నీ కొడుకులని దేవతలు చంపారు. కాబట్టి దేవేంద్రుడ్ని చంపగలిగే లోకనాయకుడైన కొడుకు నాకు కావాలి. అందుకు వీలుగా తపస్సు చేయడానికి నాకు అనుమతి కావాలి’
‘అలాగే, వెయ్యి సంవత్సరాలు నువ్వు పవిత్రంగా ఉంటూ తపస్సు చేస్తే మూడు లోకాలకి ప్రభువయ్యే కొడుకుని నా వల్ల కంటావు’ అతను చెప్పి ఆమె శరీరమంతా తడిమి తను కూడా తపస్సు చేసుకోడానికి వెళ్లాడు.
దితి కుశప్లవనం అనే చోట తీవ్ర తపస్సుని ఆరంభించింది. ఆ సమయంలో దేవేంద్రుడు ఆమెకి నిప్పు, దర్భలు, సమిథలు, నీళ్లు, పళ్లు, దుంపలు మొదలైనవన్నీ సమకూర్చడం, శ్రమ తీరేలా ఒళ్లు పట్టడం లాంటి ఉపచారాలతో చక్కటి సేవ చేశాడు. ఇలా తొమ్మిది వందల తొంభై సంవత్సరాలు గడిచాయి. దితి ఆ సేవకి సంతోషించి దేవేంద్రుడితో చెప్పింది.
‘దేవేంద్రా! నా కోరిక మీద మీ నాన్న వెయ్యి సంవత్సరాల తర్వాత నాకో కొడుకు పుడతాడనే వరాన్ని ఇచ్చాడు. ఇంకో పదేళ్ల తర్వాత నువ్వు నీ తమ్ముడ్ని చూస్తావు. నువ్వు వాడితో కలిసి మూడు లోకాలని జయించి పాలించగలవు’
ఆ రాత్రి దితి తల స్థానంలో పాదాలని ఉంచి, పాదాల మీద జుట్టు పడుతూండగా నిద్రపోయింది. దాంతో అపవిత్రురాలైన దితిని చూసి దేవేంద్రుడు ఆమె గర్భంలోకి ప్రవేశించి వంద అంచుల వజ్రాయుధంతో పిండాన్ని ఏడు ముక్కలుగా నరికాడు. గర్భంలోంచి వినపడ్డ ఏడుపుకి, ఏడవవద్దనే మాటలకి దితి నిద్ర లేచింది. జరిగేది గ్రహించి తన కొడుకుని చంపద్దని దేవేంద్రుడ్ని కోరగా తండ్రి మీది గౌరవంతో అతను ఆమె గర్భంలోంచి బయటకి వచ్చాడు.
‘యుద్ధంలో నన్ను చంపబోయే పిల్లవాడు కాబట్టి నరికాను. క్షమించు’ దేవేంద్రుడు దితిని కోరాడు. (బాలకాండ సర్గ 45-46)
వెంటనే శ్రోతల్లోని ఒకతను లేచి చెప్పాడు.
‘క్షీర సాగర మథనం కథ రామాయణంలోనే కాక చాలా పురాణాల్లో వచ్చింది. నేను అవన్నీ క్షుణ్ణంగా చదివాను. మీరు చెప్పిన వాటిలో నాకు ఏడు తప్పులు కనిపించాయి.’
అతను వాటిని వివరించాడు. మీరు ఆ తప్పులని కనిపెట్టగలరా?

మీకో ప్రశ్నకి జవాబు
రామాయణంలో గంగానదికి ఎన్ని పేర్లు ఉన్నాయి?
1.హ్లాదిని 2.పావని 3.నళిని 4.సుచక్షువు 5.సీత 6.సింధు 7.జాన్హవి 8.త్రిపథ 9.్భగీరథి. ఇవికాక మందాకిని, అలకనంద అనే పేర్లు కూడా ఉన్నాయి.

కిందటి వారం రామాయణ కథలో తప్పులు

1.ఈ వారం హరికథ చెప్పింది సర్గ 43,44. హరిదాసు వాటిని 41, 42గా తప్పుగా చెప్పాడు.
2.శివుడు ప్రత్యక్షమైంది ఏడాది తర్వాత. వందేళ్ల తర్వాత కాదు.
3.శివుడు ‘బిందూ సరస్సు ప్రాంతంలో’ గంగని వదిలాడు. ఈ సంగతి కథకుడు చెప్పలేదు.
4.గంగ శివుడి తల మీంచి ఏడు పాయలుగా క్రిందికి ప్రవహించింది. ఆరు పాయలుగాగా కాదు.
5.జహ్ను మహర్షి యజ్ఞం చేసే యజ్ఞ వాటికని గంగ ముంచేసింది. ఆయన ఆశ్రమాన్ని కాదు.
6.జహ్ను మహర్షి గంగని చెవుల్లోంచి వదిలాడు. నోట్లోంచి ఉమ్మేయలేదు.
7.సగరుడి అరవై వేల మంది కొడుకుల చితాభస్మాలని గంగ తడిపింది. వారు మనవలు కాదు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి