జాతీయ వార్తలు

సయోధ్య దిశగా అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,్ఫబ్రవరి 15: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సజావుగా నడిచేలా చూసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు. 23నుంచి ప్రారంభం అవుతున్న బడ్జెట్ సమావేశాల్లో ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు సిద్దమవుతున్నాయి. రాజ్యసభలో తమకు మెజారిటీ ఉండటంతో ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న అన్ని ముఖ్యమైన బిల్లులను ప్రతిపక్షాలు అడ్డుకోవటంతోపాటు పార్లమెంటు ఆమోదం ముద్ర పడకుండా చేయగలుగుతున్నాయి. ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల మూలంగా గత సంవత్సరం బడ్జెట్ సమావేశాలతోపాటు ఈ సంవత్సరం వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు కూడా కొట్టుకుపోవటం తెలిసిందే. ఈ సంవత్సరం బడ్జెట్ సమావేశాలకు కూడా ఇదే గతి పట్టే ప్రమాదం నెలకొన్నది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ రేపు ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. మోదీ పార్లమెంటులోని ముఖ్యమైన పార్టీల నాయకులను రేపటి అఖిల పక్ష సమావేశానికి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు కూడా రేపటి సమావేశానికి హాజరయ్యేందుకు రేపు ఉదయం ఢిల్లీకి వస్తున్నారు. హైదరాబాదు విశ్వవిద్యాలయం పరిశోధనా విద్యార్థి రోహిత వేముల ఆత్మహత్య, ఢిల్లీలోని జె.ఎన్.యులో అఫ్జల్‌గురు సంస్మరణ సభలో భారత వ్యతిరేక నినాదాలు ఇచ్చిన విద్యార్థులను ఎన్.డి.ఏ ప్రభుత్వం అరెస్టు చేయటం తదితర అంశాలపై పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపజేసేందుకు ప్రతిపక్షాలు కృత నిశ్చయంతో ఉన్నాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సి.పి.ఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితోపాటు ప్రతిపక్షాలకు చెందిన పలువురు నాయకులు హైదరాబాదు విశ్వవిద్యాలయంతోపాటు జె.ఎన్.యుకు వెళ్లి విద్యార్థులకు తమ మద్దతు ప్రకటించటం తెలిసిందే. రెండు విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న పరిణామాలను పార్లమెంటులో ప్రస్తావిస్తామని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. ప్రతిపక్షాలు పట్టుదలతో ఉన్నందున పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు అత్యంత ఉద్రిక్తంగా జరుగుతాయని అధికార పక్షం అంచనా వేస్తోంది. అందుకే ఏకంగా నరేంద్ర మోదీ రంగంలోకి దిగి రేపు అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తున్నారని అంటున్నారు. బడ్జెట్ సమావేశాలు కూడా గందరగోళంలో కొట్టుకుపోతే ప్రతిపక్షాన్ని తప్పు పట్టేందుకు ప్రభుత్వం ఇప్పటి నుండే ప్రాతిపదికను సిద్దం చేస్తోంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ముందు బి.జె.పి, ఎన్,డి.ఏ అధినాయకులు ప్రతిపక్షాలతో చర్చలు జరపలేదనే అపవాదు రాకుండా చూసుకునేందుకే నరేంద్ర మోదీ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారని అంటున్నారు.