జాతీయ వార్తలు

రాజ్యసభ నామినేషన్ల ఘట్టానికి తెర: ఆరుసీట్లకూ ఏకగ్రీవ ఎన్నిక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఆరు సీట్లకు ఏకగ్రీవ ఎన్నికలు జరిగినట్లే. పోలింగ్ అవసరం లేకుండానే ఎన్నికల ఘట్టానికి తెర పడనుంది. తెలంగాణలో రెండు సీట్లకు తెరాస నుంచి డిఎస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు నామినేషన్లు వేశారు. వేరెవరూ నామినేషన్లు వేయనందున ఈ ఇద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టే. అలాగే, ఎపిలో నాలుగు సీట్లకు అయిదుగురు నామినేషన్లు వేశారు. వైకాపా తరఫున విజయసాయి రెడ్డి, డమీగా ఆయన భార్య సునందా రెడ్డి నామినేషన్లు వేశారు. సునంద నామినేషన్ ఉపసంహరించుకుంటారు గనుక విజయసాయి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే. తెలుగుదేశం అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన సుజనా చౌదరి, టిజి వెంకటేష్, బిజెపి తరఫున నామినేషన్ దాఖలు చేసిన కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభు కూడా పోటీ లేకుండా ఎన్నికైనట్టే. నాలుగో సీటుకు టిడిపి మద్దతుతో ఎవరూ నామినేషన్ వేయనందున పోలింగ్ అవసరం లేకుండానే ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.