రంగారెడ్డి

కందులు కొనుగోళ్లు చేయాలంటూ అధికారి కాళ్లు పట్టుకున్న మహిళా రైతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, ఫిబ్రవరి 24: కందులు కొనుగోలు చేయాలంటూ ఓ మహిళా రైతు అధికారుల కాళ్లు పట్టుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. రైతుల నుండి పూర్తి స్థాయిలో కందులను కొనుగోళ్లు చేయాలని ప్రభుత్వం అదేశాలు జారీ చేసినప్పటికి స్థానిక అధికారుల నిర్లక్ష్యం, ఆలసత్వం కారణంగా కొనుగోళ్లు నిలిపివేసి వ్యాపారులు, దళారీల నుండి కొనుగోళ్లు చేయడంపై రైతులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం షాద్‌నగర్ పట్టణ శివారులోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. డివిజన్‌లోని వివిధ గ్రామాల నుండి రైతులు కందులను తీసుకొని వస్తే కొనుగోలు చేయకుండా కందుల కొనుగోలు కేంద్రాన్ని మూసివేయడంతో రైతులు ఒక్కసారిగా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే అధికారులు మాత్రం వ్యాపారులు, మధ్యదళారీలతో కుమ్మక్కై రైతులను పక్కకు నేట్టుతున్నారని ఆరోపించారు. వారం రోజులుగా కందులను తీసుకొని కొనుగోలు కేంద్రానికి వస్తే తీసుకోకుండా కేంద్రం మూసివేశామని డీసీఎంఎస్ ఇన్‌చార్జి అధికారి నర్సింహా రెడ్డి చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. ఆరుగాలం కష్టపడి పంటలను సాగుచేసి విక్రయించేందుకు మార్కెట్‌కు తీసుకువస్తే కొనుగోలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహించడం ఏమిటని రైతులు ప్రశ్నించారు. డిసీఎంఎస్ ఇన్‌చార్జి అధికారి నర్సింహా రెడ్డి వద్ద నకిలీ సర్ట్ఫికెట్లు లభించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారులకు, మధ్య దళారీల నుంచి నకిలీ సర్ట్ఫికెట్లు తీసుకొని కందులు కొనుగోలు ఎందుకు చేస్తున్నావంటూ ప్రశ్నించారు. కష్టపడి రైతులు తీసుకువచ్చిన కందిపంటను ఎందుకు తీసుకోవడం లేదని అన్నారు. కందులను కొనుగోలు చేయాలంటూ ఓ మహిళా రైతు.. అధికారి కాళ్లు మొక్కడంతో పలువురిని కంటతడి పెట్టించింది. డివిజన్‌లోని ఆరు మండలాల నుండి సుమారు వందమంది రైతులు 300 క్వింటాళ్ల వరకు కందులను తీసుకువచ్చారు. కందులను కొనుగోళ్లు చేయాలంటూ అధికారుల చుట్టు ప్రదక్షణనలు చేస్తుంటే పట్టించుకోకుండా వ్యాపారుల కొమ్ము కావడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. డీసీఎంఎస్ ఇన్‌చార్జి అధికారి నర్సింహా రెడ్డి.. ఉన్నతాధికారులతో ఫొన్‌లో మాట్లాడి కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు.
కందులు కొనుగోలు చేసిన బిల్లులను సకాలంలో చెల్లించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. కందిపంటను విక్రయించి దాదాపు 20రోజులు గడుస్తున్నా నేటి వరకు డబ్బులు చెల్లించకపోవడం ఏమిటని ప్రశ్నించారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే కొనుగోళ్లు
* డీసీఎంఎస్ ఇన్‌చార్జి అధికారి నర్సింహా రెడ్డి
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే కందులు కొనుగోళ్లు చేశామని, మళ్లీ ఆదేశాలు వస్తే కొనుగొలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు షాద్‌నగర్ డీసీఎంఎస్ ఇన్‌చార్జి అధికారి నర్సింహా రెడ్డి వివరించారు. ప్రస్తుతం మార్కెట్‌కు వచ్చిన కందులను కొనుగోలు చేసేందుకు అధికారులు ఆదేశాలు ఇచ్చారని, వాటిని కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.