రంగారెడ్డి

పారదర్శకంగా పంచాయతీల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, ఫిబ్రవరి 20: పారదర్శకంగా పంచాయతీల అభివృద్ధికి సర్పంచులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గ్రామపంచాయతీలను ఆదర్శంగా తీర్దిదిద్దే ఉద్దేశంతో త్వరలో ప్రభుత్వం పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో పంచాయతీ సమ్మేళనం నిర్వహించారు. పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహణ, విధులపై ప్రజాప్రతినిధులకు, అధికారులకు దిశ నిర్ధేశం చేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ స్వచ్చ, పచ్చని గ్రామాలుగా తీర్చిదిద్ధేందుకు ప్రజలందరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇంటింటికీ ఐదు మొక్కలను ఇవ్వడమే కాకుండా నాటి రక్షించే బాధ్యత ఆ ఇంటి యజమానులు తీసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని పనులకు ప్రభుత్వం నిధులు కేటాయించిందని, సమగ్రాభివృద్ధియే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని పేర్కొన్నారు. పంచాయతీల వారీగా ట్రాక్టర్లను కొనుగోలు చేయడమే కాకుండా వైకుంఠ దామాల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వర్షాకాలం నాటికి నర్సరీల్లో మొక్కలు అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. పల్లెప్రగతి పనులపై నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఆదర్శ పంచాయతీలే లక్ష్యంగా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇంటింటికీ పంట రుణమాఫీ చెక్కులను అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని, త్వరలోనే పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. పంచాయతీల మధ్య అభివృద్ధి విషయంలో పోటీ ఉన్నప్పుడే ఆ గ్రామాలు ఆదర్శంగా రూపు దిద్దుకుంటాయని, ఆ దిశగా సర్పంచ్‌లు కృషి చేయాలని అన్నారు. నిరక్షరాస్యతను నిర్మూలించడంతోపాటు అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పంచాయతీల వారీగా నిరక్ష్యరాసుల వివరాలను సేకరించి అక్షరాస్యత పెంపొందించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు. త్వరలోనే పల్లె నిద్ర చేపట్టి పంచాయతీల్లో నెలకొన్న సమస్యలను స్వయంగా తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేస్తామని వివరించారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతితో గ్రామాలు పచ్చగా ఉండేందుకు ప్రజాప్రతినిధులు సమష్టిగా పనిచేయాలని అన్నారు. నాటిన మొక్కలను రక్షించడమే కాకుండా ఇంటింటికీ కొత్తగా ఐదు మొక్కలను ఇవ్వాలని సూచించారు. జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి మాట్లాడుతూ పంచాయతీ రాజ్ చట్టాన్ని పకడ్బంధీగా అమలు చేయడంతోపాటు పల్లె సీమల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ వెనకబడిన పంచాయతీలు అభివృద్ధి సాధిస్తేనే రాష్ట్రం బంగారు మయంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల రూపురేకలు మార్చేందుకే పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ పారిశుద్ధ్య పనులతోపాటు హరితహారానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.