రంగారెడ్డి

ప్రణాళికా బద్దంగా సమస్యలను పరిష్కరిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఫిబ్రవరి 16: ప్రణాళిక బద్ధంగా ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని నిజాంపేట్ నగర పాలక సంస్థ మేయర్ కొలను నీలా గోపాల్ రెడ్డి అన్నారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 4వ డివిజన్ ప్రగతినగర్‌లో గుడ్ మార్కింగ్ కార్యక్రమంలో భాగంగా మేయర్, కమిషనర్ గోపిలు పర్యటించారు. కాలనీలలో నెలకొన్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. మేయర్ కొలను నీలారెడ్డి మాట్లాడుతూ కాలనీలలో వీది దీపాలు, రోడ్లు, తాగునీరు, పార్కుల అభివృద్ధి వంటి సమస్యలు దృష్టికి వచ్చాయని తెలిపారు. కార్పొరేటర్‌లు శ్రీరాములు, వెంకట సత్యవాణి, సుజాత, మాధవి, లక్ష్మీకుమారి, శ్రీనివాస్ యాదవ్, ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి, సురేశ్ రెడ్డి, ఆవుల జగదీశ్, జగన్, ఇంద్రజిత్, యాదగిరి, శ్రీకర్, నర్సయ్య పాల్గొన్నారు.
గణేశ్ హౌసింగ్ కాలనీకి అందుబాటులో ఉంటా
జీడిమెట్ల, ఫిబ్రవరి 16: గణేశ్ హౌసింగ్ కాలనీకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని టీఆర్‌ఎస్ యువ నాయకుడు కేపీ విశాల్ అన్నారు. జీడిమెట్ల డివిజన్ గణేశ్ హౌసింగ్ కాలనీలో జరిగిన సమావేశానికి కేపీ విశాల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విశాల్ మాట్లాడుతూ కాలనీలో నెలకొన్న సమస్యలను కార్పొరేటర్ కేఎం పద్మ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని అన్నారు. కాలనీ అభివృద్ధికి కలిసి కట్టుగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి, యాదగిరి, టీవీ రావు పాల్గొన్నారు.

బడిబాటలో నిర్లక్ష్యంతో వెనుకబడి

మూత బడి!

*కనుమరుగవుతున్న ప్రాథమిక పాఠశాలలు
* కొత్తూరు మండలంలో
10పీఎస్ పాఠశాలల విలీనం
* క్రమంగా తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య
* అవగాహన కల్పించడంలో విఫలం
కొత్తూరు, ఫిబ్రవరి 16: ప్రాథమిక పాఠశాలల ఎత్తివేత కార్యక్రమం..రానురాను పెరుగుతోంది. మండలంలో ఇప్పటికే విలీనం పేరిట 10ప్రాథమిక పాఠశాలలు కనుమరుగయ్యాయి. గ్రామీణ స్థాయిలో ఉన్న సర్కారు బడులను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేయాల్సింది పోయి దూరం చేస్తుండటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తూరు, నందిగామ ఉమ్మడి మండలాల్లో 53ప్రాథమిక పాఠశాలలు, ఏడు ప్రాథమికోన్నత, పది జిల్లా పరిషత్, ఒకటి కస్తూర్భా గాంధీ పాఠశాలలు నడుస్తున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుండటంతో ఆపాఠశాలల్లో ఉన్న కొద్దిపాటి చిన్నారులను సమీపంలో ఉన్న పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఇప్పటి వరకు కొత్తూరు మండలంలో పది ప్రాథమిక పాఠశాలలు ఇతర పాఠశాలల్లో విలీనం చేశారు. ఆ పాఠశాలలు కాస్తా మూతపడిపోయాయి. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తారు..కానీ ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించకపోవడంతోనే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రాథమిక పాఠశాలలు కొనసాగాలంటే విధిగా 15మంది నుండి 20మంది విద్యార్థులు ఉండాల్సిందే. కానీ విద్యార్థులు ప్రాథమిక పాఠశాలకు వచ్చేందుకు ఎక్కువగా అసక్తి చూపించకపోవడంతో క్రమంగా మూతపడుతున్నాయి. బడిబాట కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు పకడ్బంధీగా చర్యలు తీసుకుంటేనే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి.
విలీనం చేసిన
పది పాఠశాలలు ఇవే!
కొత్తూరు మండలంలో విలీనం చేసిన పది పాఠశాలలు ఈ విధంగా ఉన్నాయి. మండలంలోని అక్కివానిగూడ పాఠశాలను తిమ్మాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనం చేశారు. అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు శ్రీలతను తిమ్మాపూర్‌కు బదిలీ చేశారు. మల్లాపూర్ పంచాయతీ రెడ్డిపాలెంలో కొనసాగుతున్న ప్రాథమిక పాఠశాలను మల్లాపూర్ ఎస్సీ కాలనీలో కొనసాగుతున్న ప్రాథమిక పాఠశాలలో విలీనం చేశారు. స్టేషన్ తిమ్మాపూర్ ప్రాథమిక పాఠశాలను సమీపంలో ఉన్న కుమ్మరిగూడ ప్రాథమికోన్నత పాఠశాలలో, కొత్తూరు తండాలో ఉన్న ప్రాథమిక పాఠశాలను మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో విలీనం చేశారు. నందిగామ మండలంలోని పిట్టలగూడ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను రంగాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనం చేశారు. అక్కడ చదువుకుంటున్న నలుగురు విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులను రంగాపూర్‌కు బదిలీ చేశారు. మొదళ్లగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని మంచన్‌పహాడ్ ప్రాథమిక పాఠశాలను మాజీద్ మామిడిపల్లిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో విలీనం చేసి అక్కడ చదువుకుంటున్న నలుగురు విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలకు వెళ్లారు. ఉపాధ్యాయురాలు శ్రీదేవిని మజీద్ మామిడిపల్లికి బదిలీ చేశారు.
ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి సమీపంలో ఉన్న పాఠశాలల్లో విలీనం చేస్తున్నామని కొత్తూరు మండల ఇన్‌చార్జి ఎంఇఓ కృష్ణ తెలిపారు.