రంగారెడ్డి

సహకార సంఘాలు గులాబీకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, ఫిబ్రవరి 16: షాద్‌నగర్ డివిజనులో సహకార సంఘాలు గులాబీ మయమయ్యాయి. ఆరు సహకార సంఘాలకు ఐదు సహకార సంఘాలలో కారు దూసుకుపోగా ఒక చోట హస్తం ఉనికిని చాటుకుంది. షాద్‌నగర్ (్ఫరూక్‌నగర్), కొందుర్గు, కొత్తపేట (కేశంపేట), చేగూరు, మేకగూడ (నందిగామ)లో సహకార సంఘాల చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను టీఆర్‌ఎస్ తన ఖాతాలో జమ చేసుకుంది. షాద్‌నగర్, కొందుర్గు, కొత్తపేట, చేగూరు, మేకగూడ చైర్మన్లుగా బక్కన్న, దామొదర్ రెడ్డి, జగదీశ్వర్ గౌడ్, పబ్బె అశోక్, మంజుల రెడ్డి ఎన్నికయ్యారు. నందిగామ సహకార సంఘం చైర్మనుగా కాంగ్రెస్‌కి చెందిన రాజగోపాల్ ఎన్నికయ్యారు. ఇక్కడ మాత్రం కాంగ్రెస్ తన ఉనికిని చాటుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించిన టీఆర్‌ఎస్ తాజాగా జరిగిన సహకార సంఘాల ఎన్నికల్లోను గెలుపును సొంతం చేసుకుంది. ఇంతకు ముందు చాలా మటుకు సహకార సంఘాలు కాంగ్రెస్ ఖాతాలో ఉండేవి. ఇపుడేమో కేవలం నందిగామ సహకార సంఘంలో కాంగ్రెస్ ఉనికిని చాటుకుంది.
మధ్యాహ్నంలోపే ఆరింటిలో ఐదింటి ఫలితాలు తేలగా నందిగామలో మాత్రం హైడ్రామా కొనసాగింది. నందిగామ సహకార సంఘం ఎన్నికలను మాత్రం కాంగ్రెస్, టీఆర్‌ఎస్ వర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు అలుముకున్నాయి. ఇక్కడ ఓటింగ్ వరకు రావడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా షాద్‌నగర్ రూరల్ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.
షాద్‌నగర్ సహకార సంఘం చైర్మన్‌గా బక్కన్న
షాద్‌నగర్ సహకార సంఘం చైర్మన్‌గా బక్కన్న యాదవ్ ఎన్నికయ్యారు. ఆదివారం సహకార సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశంలో చైర్మను పదవికి బక్కన్న యాదవ్, వైస్ చైర్మన్ పదవికి చల్లా పాండు రంగారెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. పోటీగా ఎవరు లేకపోవడంతో ఏకగ్రీవంగా బక్కన్న చైర్మనుగా, వైస్ చైర్మనుగా పాండు రంగారెడ్డి ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైన బక్కన్న, పాండురంగా రెడ్డిని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు సన్మానాలతో ముంచెత్తారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, మాజీ ఎంపిపి బెంది శ్రీనివాస్ రెడ్డి, ఫరూక్‌నగర్ మండల పరిషత్ అధ్యక్షుడు ఖాజా ఇద్రిస్, జడ్పీటీసీ సభ్యుడు వెంకట్రాంరెడ్డి అభినందించారు. రైతుల సంక్షేమం కోసం పని చేస్తానని కొత్తగా ఎన్నికైన షాద్‌నగర్ పీఏసీఎస్ చైర్మను బక్కన్న యాదవ్ అన్నారు. రైతులకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని అన్నారు.
నందిగామ ‘హస్త’గతం
కొత్తూరు: ఎట్టకేలకు హైడ్రామా మధ్య ఆదివారం సాయంత్రం నందిగామ సహకార సంఘం ఫలితం వెలువడింది. షాద్‌నగర్ డివిజను పరిధిలోని ఆరు సహకార సంఘాల ఫలితాలు మధ్యాహ్నానికే వెలువడగా నందిగామ ఫలితం మాత్రం ఉత్కంఠను రేపింది. మెజారిటీ డైరెక్టర్ స్థానాలు కాంగ్రెస్‌కు ఉన్నా..ఏ మూలో ఏదో జరుగబోతోందని అనుమానాల మధ్య కాంగ్రెస్ శిబిరం తటపటాయించింది. చివరకు ఓటింగ్ సమయానికి టీఆర్‌ఎస్ పక్కకు తప్పుకోవడంతో కాంగ్రెస్ శిబిరం ఊపిరి పీల్చుకుంది. దీంతో చైర్మనుగా రాజగోపాల్ (కాంగ్రెస్)వైస్ చైర్మనుగా రజనీకాంత్ (కాంగ్రెస్)లను ఎన్నికైనట్లు ప్రకటించారు.
రైతు సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ముందుంటామని నందిగామ సహకార సంఘం చైర్మనుగా ఎన్నికైన తోట రాజగోపాల్ అన్నారు. ఆదివారం నందిగామ మండల కేంద్రంలో ఎన్నికల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఓటింగ్ ద్వారా ఎన్నికైన రాజగోపాల్ మాట్లాడుతూ రైతులు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తామని స్పష్టం చేశారు. రజనీ కాంత్ మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉంటూ అభివృద్దికి కృషి చేస్తామని అన్నారు.
రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తా
కొత్తూరు రూరల్: రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తానని నందిగామ మండలం మేకగూడ పీఏసిఎస్ చైర్మన్‌గా ఎన్నికైన కంకంటి మంజుల రెడ్డి అన్నారు. ఆదివారం మేకగూడ సహకార సంఘంలో జరిగిన ఎన్నిక కార్యక్రమంలో టిఆర్‌ఎస్ తరపున చైర్మనుగా మంజుల రెడ్డి, వైస్ చైర్మను శ్రీనివాస్‌రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తానని నందిగామ మండలం చేగూరు సహకార సంఘం చైర్మనుగా ఎన్నికైన పబ్బె అశోక్ అన్నారు. ఆదివారం పీఏసీఎస్ చైర్మనుగా ఏకగ్రీవంగా ఎన్నికైన తరువాత మాట్లాడుతూ రైతులు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారికి అందుబాటులో ఉంటూ..సమస్యలను దూరం చేసేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. వైస్ చైర్మనుగా ఎన్నికైన మున్నూరు పద్మారావు మాట్లాడుతూ రైతులకు సేవ చేసే భాగ్యం లభించినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.