రంగారెడ్డి

బోడుప్పల్‌లో గులాబీ జయకేతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జనవరి 25: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీ విజయఢంకా మోగించింది. శనివారం స్థానిక మా గార్డెన్‌లో ఓట్ల లెక్కింపులో 17వ డివిజన్ నుంచి బరిలో నిలిచిన టీఆర్‌ఎస్ మేయర్ అభ్యర్థి మంద సంజీవ రెడ్డి సమీప కాంగ్రెస్ అభ్యర్థి పోగుల నర్సింహా రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అనుకున్న స్థానాలను కైవసం చేసుకోకబోయినా మెజార్టీ స్థానాలను దక్కించుకుంది. మొత్తం 28 డివిజన్లలో టీఆర్‌ఎస్-14, కాంగ్రెస్-7, బీజేపీ-2, స్వతంత్రులు 5 దక్కించుకున్నారు. డివిజన్ల వారిగా 1 నుంచి 28వరకు గెలిచిన అభ్యర్థులలో బింగి జంగయ్య టీఆర్‌ఎస్, కొత్త లక్ష్మి టీఆర్‌ఎస్, కొత్త చందర్ టీఆర్‌ఎస్, సింగిరెడ్డి పద్మారెడ్డి స్వతంత్ర, తోటకూర అజయ్ యాదవ్ కాంగ్రెస్, కే.లతా రెడ్డి టీఆర్‌ఎస్, సీస వెంకటేశ్వర్లు టీఆర్‌ఎస్, మోదుగు లావణ్య టీఆర్‌ఎస్, బొమ్మక్ సుగుణ టీఆర్‌ఎస్, కొత్త శ్రీవిద్య టీఆర్‌ఎస్, బొమ్మక్ కల్యాణ్ కాంగ్రెస్, దానగల్ల అనిత యాదగిరి కాంగ్రెస్, కుంభం కిరణ్ కుమార్ బీజేపీ, కొత్త దుర్గమ్మ కాంగ్రెస్, సామల బుచ్చిరెడ్డి టీఆర్‌ఎస్, పోగుల నర్సింహా రెడ్డి కాంగ్రెస్, పులకండ్ల హేమలత జంగారెడ్డి స్వతంత్ర, సామల పవన్ రెడ్డి బీజేపీ, జడిగే మహేందర్ యాదవ్ టీఆర్‌ఎస్, భూక్యా సుమన్ నాయక్ టీఆర్‌ఎస్, డీ.మహేశ్వరి టీఆర్‌ఎస్, రాసాల వెంకటేశ్ యాదవ్ టీఆర్‌ఎస్, గుర్రాల రమ స్వతంత్ర, జక్కల పద్మ రాములు టీఆర్‌ఎస్, పొద్దుటూరి శోభారాణి కాంగ్రెస్, బందారపుఅంజలిదేవి స్వతంత్ర, చీరాల నర్సింహ స్వతంత్రంగా ఎన్నికయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారుల నుంచి ఎన్నిక పత్రాలను స్వీకరించారు. మేయర్ అభ్యర్థి మంద సంజీవ రెడ్డి ఓటమితో పీఠం ఎవరికి వరిస్తుందోనని పలువురు ఆసక్తిని కనబరుస్తున్నారు.
ఏడు సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ .. స్వతంత్ర అభ్యర్థులదే హవా
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కన్పించినా ఫలితం దక్కలేదు. హోరాహోరీగా ప్రచారం నిర్వహించి గెలుపు దిశగా దూసుకెళ్లిన కాంగ్రెస్ కేవలం 7 సీట్లకే పరిమితమైంది. బీజేపీ అనుకున్నట్లుగా ఫలితాలు దక్కకపోగా కేవలం రెండు సీట్లకే పరిమితమైంది. టిక్కెట్ ఆశించి భంగపడ్డ స్వతంత్ర అభ్యర్థులలు గట్టి పోటీనిచ్చి ఐదు డివిజన్లు కైవసం చేసుకుని తమ సత్తా అంటే చూపించారు. టిక్కెట్ల కేటాయింపులో మంత్రి మల్లారెడ్డి వద్ద చక్రం తిప్పి తన అనుచరులకే ఇప్పించుకున్న మంద సంజీవరెడ్డి 17వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి పోగుల నర్సింహా రెడ్డి చేతిలో ఓటమి చూడకతప్పలేదు. టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి పులకండ్ల జంగా రెడ్డి టిక్కెట్ వచ్చి చేజారిపోయింది. అయినా అధైర్యపడకుండా 18వ డివిజన్‌లో తన భార్య హేమలతను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దింపి కార్పొరేటర్‌గా గెలుపించుకుని సత్తా చాటుకున్నారు. 28వ డివిజన్‌లో తెలంగాణ ఉద్యమకారుడు నత్తి మైసయ్య టీఆర్‌ఎస్ రెబల్, స్వతంత్ర అభ్యర్థి చీరాల నర్సింహ చేతిలో ఓటమిపాలయ్యారు. 14, 19వ డివిజన్‌లో టీఆర్‌ఎస్ గాలిలో రెండు డివిజన్లను కిరణ్ కుమార్ రెడ్డి, సామల పవన్ రెడ్డి కైవసం చేసుకుని కమలం వికసింప జేయడంలో సఫలీకృతులయ్యారు. 14వ డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి బొమ్మక్ విజయలక్ష్మి ఇంటి మనుష్యుల చేతిలో ఓటమి కావడం గమనార్హం. కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన అత్తా కోడళ్లు కొత్త దుర్గమ్మ, స్రవంతి ఘన విజయం సాధించగా టీఆర్‌ఎస్ నుంచి బరిలో నిలిచిన భార్యాభర్తలు జడిగె రమేశ్, మంజుల ఓటమి చెందారు.
బండ్లగూడ కార్పొరేషన్‌లో సత్తా చాటిన టీఆర్‌ఎస్
నార్సింగి, జనవరి 25: బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శనివారం ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో ఒకటో డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి టి.చంద్రశేఖర్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి బి.శ్రీనివాస్‌పై 691 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. చంద్రశేఖర్‌కు 1066 ఓట్లు రాగా శ్రీనివాస్‌కు 375 ఓట్లు వచ్చాయి. 2వ డివిజన్ టీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి తలారి పద్మావతి తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి.సునంధపై 294 ఓట్ల తేడాతో గెలుపొందారు. పద్మావతికి 783 ఓట్లు రాగా సునందకు 489 ఓట్లు వచ్చాయి. 3వ డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎం.సంతోషిరాజిరెడ్డి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి రాధారెడ్డిపై 215 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సంతోషిరాజిరెడ్డికి 644 ఓట్లు రాగా, రాధారెడ్డికి 429 ఓట్లు వచ్చాయి. 4వ డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎం.రవీందర్‌రెడ్డి తన సమీప స్వతంత్ర అభ్యర్ధి వేణుగోపాల్‌పై 506 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 5వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనాథ్‌రెడ్డి తన సమీప టీఆర్‌ఎస్ అభ్యర్ధి బాలకృష్ణపై 376 ఓట్ల మెజారిటోతో గెలుపొందారు. శ్రీనాథ్‌రెడ్డికి 659 ఓట్లు రాగా బాలకృష్ణకు 293 ఓట్లు పోల్ అయ్యాయి. 6వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సుల్తానాబేగం తన సమీప టీఆర్‌ఎస్ అభ్యర్థి జమునపై 137 మెజారిటితో గెలుపొందారు. సుల్తానాబేగం 445 ఓట్లు రాగా టీఆర్‌ఎస్ అభ్యర్థి 308 ఓట్లు పోల్ అయ్యాయి. 7వ డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మావతి యాదవ్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఫైమీనాబేగంపై 30 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పద్మావతికి 383 ఓట్లు రాగా ఫైమీనాబేగంకు 353 ఓట్లు పోల్ అయ్యాయి. 8వ డివిజన్‌లో బీజేపీ పార్టీ అభ్యర్ధి బుర్ర భూపాల్‌గౌడ్ తన సమీప టీఆర్‌ఎస్ అభ్యర్థి వేణుగోపాల్‌పై 501 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. భూపాల్‌గౌడ్‌కు 930 ఓట్లు పోల్ కాగా వేణుగోపాకు 429 ఓట్లు వచ్చాయి. 9వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి లంక నిఖిలారెడ్డి తన సమీప టీఆర్‌ఎస్ అభ్యర్థి రంజితరెడ్డిపై 30 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నిఖిలారెడ్డికి 781 ఓట్లు పోల్ కాగా, రంజితరెడ్డికి 751 ఓట్లు వచ్చాయి. 10వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి ప్రశాంత్ తన సమీప టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎం.రాజుపై 22 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఫ్రశాంత్‌కు 524 ఓట్లు రాగా రాజుకు 502 ఓట్లు పోల్ అయ్యాయి. 11వ డివిజన్‌లో ఎంఐఎం అభ్యర్థి అస్లామ్ బిన్ అబ్దుల్లా తన సమీప టీఆర్‌ఎస్ అభ్యర్థి మలాకీ రత్నంపై 120 ఓట్ల మెజారీటీతో గెలుపొందారు. అస్లామ్ బిన్ అబ్దుల్లాకు 806 ఓట్లు రాగా మలాకీ రత్నంకు 686 ఓట్లు పోల్ అయ్యాయి. 12వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఎం.రాజు తన సమీప టీఆర్‌ఎస్ అభ్యర్ధి రాజుపై 71 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రాముకు 756 ఓట్లు రాగా రాజుకు 685 ఓట్లు వచ్చాయి. 13వ డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్ధిని మలతీ నాగరాజు తన సమీఅప కాంగ్రెస్ అభ్యర్ధిని కోరివి అంజలిపై 206 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మాలతీకి 622 ఓట్లురాగా అంజలికి 416 ఓట్లు వచ్చాయి. 14వ డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్ధి అసీయాబేగం తన సమీప కాంగ్రెస్ అభ్యర్ధి సునీతపై 56 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అసియాకు 685 ఓట్లు రాగా సునీతకు 629 ఓట్లు వచ్చాయి. 15వ డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పూలపల్లి రాజేందర్‌రెడ్డి తన సమీప కాంగ్రెస్ అభ్యర్ధి పూలపల్లి కృష్నారెడ్డిపై 282 ఓట్ల మెజార్టీతో విజయం సాదించారు. రాజేందర్‌రెడ్డికి 880 ఓట్లు రాగా కృష్ణారెడ్డికి 590 ఓట్లు పోల్ అయ్యాయి. 16వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఎస్.పుష్పమ్మ తన సమీప టీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రేమిలపై 303 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పుష్పమ్మకు 590 ఓట్లు రాగా ప్రేమిలకు 287 ఓట్లు పోల్ అయ్యాయి. 17వ డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి లతప్రేమ్‌గౌడ్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి మాధవిపై 710 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. లతకు 998 ఓట్లు రాగా మాధవికి 288 ఓట్లు పోల్ అయ్యాయి. 18వ డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి శ్రీలతసురేష్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి శాలినిశేఖర్‌పై 99 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. శ్రీలతకు 806 ఓట్లు రాగా శాలినికి 707 ఓట్లు పోల్ అయ్యాయి. 19వ డివిజన్‌లో టీ ఆర్ ఎస్ ఆర్టీ అభ్యర్ధి నాగుల శ్రవంతినరేందర్ తన సమీప బీజేపీ అభ్యర్థి జానకిదేవిపై 717 ఓట్ల తేడాతో విజయం సాధించారు. శ్రవంతికి 890 ఓట్లు రాగా జానకిదేవి 173 ఓట్లు పోల్ అయ్యాయి. 20వ డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి సాగర్‌గౌడ్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి అభిలాష్‌పై 168 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సాగర్‌గౌడ్కు 893 ఓట్లు రాగా అభిలాష్‌కు 725 ఓట్లు పోల్ అయ్యాయి. 21వ డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి బి.అనిత తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రవీణ్‌పై 189 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అనితకు 709 ఓట్లు రాగా ప్రవీణ్‌కు 520 ఓట్లు పోల్ అయ్యాయి. 22వ డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి బి.మహేందర్‌గౌడ్ తన సమీప స్వతంత్ర అభ్యర్థి శేఖర్‌బాబుపై 808 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మహేందర్‌గౌడ్‌కు 952 ఓట్లు రాగా శేఖర్‌బాబుకు 144 ఓట్లు వచ్చాయి.
అక్కా తమ్ముళ్ల విజయం
బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శనివారం ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో అక్కాతమ్ముడు విజయం సాధించారు.