రంగారెడ్డి

షాద్‌నగర్‌లో స్వల్ప లాఠీ చార్జీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, జనవరి 22: ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నారంటూ ఒక వార్డులో.. దొంగ ఓట్లు వేసారంటూ మరో వార్డులో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకచోట పోలీసులు లాఠీచార్జీ చేయగా.. మరో చోట ఆర్డీఓ చేరుకుని పరిస్థితులను అదుపులోకి తీసుకు వచ్చారు. 1వ వార్డులో పార్టీ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి స్వల్ప లాఠీచార్జీ చేశారు. బుధవారం ఫరూఖ్‌నగర్‌లోని పాత జాతీయ రహదారి పక్కన ఉర్దూ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం ముందు స్వల్ప లాఠీచార్జీ చోటు చేసుకుంది. అధికార పార్టీ, ఎంఐఎంల నేతల మద్య వాగ్వివాదం చోటు చేసుకుని, తోపులాట చోటు జరిగింది. ఫరూఖ్‌నగర్ ఎంపీపీ ఖాజా ఇద్రీస్ పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకోగానే విషయాన్ని గమనించి ఎంఐఎం నేతలు వాగ్వివాదానికి దిగారు. పోలింగ్ కేంద్రం వద్ద అధికార పార్టీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఎంఐఎం నేతలు వాగ్వివాదానికి దిగారు. ప్రచారం చేసేందుకు రాలేదని, పోలింగ్ సరళి ఎలా ఉందనే విషయాన్ని పరిశీలించేందుకు వచ్చానని ఇలా వ్యవహరించడం సరి కాదని ఎంపీపీ పేర్కొన్నారు. ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంటున్న తరుణంలోనే విషయాన్ని గమనించిన పోలీసులు స్వల్ప లాఠీ చార్జీకి దిగారు. షాద్‌నగర్ సీఐ శ్రీ్ధర్ కుమార్ నేతృత్వంలో ఎస్‌ఐ దేవ రాజ్, స్పెషల్ పార్టీ పోలీసులు 1వ వార్డు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకొని ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలను చెదరగొట్టారు. పోలింగ్ కేంద్రం పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉందని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరికలు జారీ చేశారు. అధికార పార్టీ ఎంపీపీని, ఎంఐఎం నేతలను పోలింగ్ కేంద్రం నుండి పంపించి వేశారు. సమాచారం అందుకున్న షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ హుటాహుటిన సిబ్బందితో మొదటి వార్డు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకొని పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేసి నిఘా పటిష్టం చేయాలని సూచించారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులను పోలింగ్ కేంద్రం వద్దకు రానివ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సీఐకి సూచించారు.