రంగారెడ్డి

డబ్బులు పంచుతూ దొరికారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, జనవరి 22: నాగారం మున్సిపల్‌లోని 17 వార్డులో టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తుండగా కాంగ్రెస్ నేతలు పోలీసులకు పట్టించారు. పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి కీసర పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 13 వార్డులో టీఆర్‌ఎస్ అభ్యర్ధులు దొంగఓట్లు వేస్తున్నారని తెలిసి కాంగ్రెస్ అభ్యర్ధులు ఆందోళనకు దిగారు. నాగారంలోని జ్యోతి జ్యువెల్లర్స్‌లో ఓటర్లకు బంగారు నాణేలు, డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ అభ్యర్ధులు ఫిర్యాదు చేయటంతో పోలీసులు కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌ను, సీసీ పుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. దమ్మాయిగూడ ఒకటవ వార్డులోని రాజీవ్ గృహకల్పలో తన ఓటును వేరే వాళ్లు వేసారని మహిళ ఆందోళనకు దిగారు. తన ఓటు వేరేవాళ్లు వేస్తే అధికారులు ఎంచేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసారు. జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.