రంగారెడ్డి

జైల్లో సంస్కరణల అమలుకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాబాద్. జనవరి 18: ఖైదీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూనే వారు శిక్షాకాలం పూర్తి చేసుకొని బయటకు వెళ్లిన తరువాత సమాజంలో పునరేకీకరణ జరిగేలా సంస్కరణలు అమలు చేస్తున్నామని చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ డాక్టర్ డీ.శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం చంచల్‌గూడ జైలును సందర్శించిన అనుమతి పొందిన అనధికారుల సందర్శకుల బృం దంతో కలిసి ఖైదీల బ్యారక్‌లు, ఖైదీలచే నిర్వహిస్తున్న పలు ఉత్పత్తుల పరిశ్రమలు, ప్రధాన వంటగది, మైదానాలను పరిశీలించారు. ఖైదీల అక్షరాస్యతకు చేపట్టిన విద్యాదానం, రామకృష్ణ మఠం నిర్వహిస్తున్న నీతి ఆధ్యాత్మిక తరగతులు, ఖైదీల ఉపాధి కోసం నడుపుతున్న వివిధ వ్యాపారాల నిర్వహణ గురించి సందర్శకుల బృందానికి వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్లు ఎం.వెంకటేశ్వర్లు, ఏ.శ్రీధర్, ఎన్.నిరంజన్ రెడ్డి, .శ్రీకాంత్, ఆర్.శ్రీనివాస్, కే.నర్సింహా రెడ్డి పాల్గొన్నారు.

శిల్పారామంలో అలరించిన శివోహం
గచ్చిబౌలి, జనవరి 18: శిల్పారామంలో శివోహం నృత్య నిలయం శిష్య బృందం ప్రదర్శించిన భరతనాట్యం అలరించింది. బెంగళూరుకు చెందిన అనిల్ వీ ఐయ్యార్ శివోహం నృత్య నిలయాన్ని స్థాపించి అనేక మంది సంప్రదాయ కళాకారులను తయారు చేశారు. అనిల్ శిష్య బృందం ప్రదర్శించిన సూర్య అర్చన, తోడయ మంగళం, రామాయణం, శివతాండవం, జావళి, రాధా సమేత కృతి, దేవి కృతి, థిల్లాన అంశాలను విన్నూత్నశ్రీ, వర్ష, శర్వాణి, సుకృత, చిన్మయి, చేతన్య, అధితిలు అద్భుతంగా నృత్యం చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలి
షాద్‌నగర్ టౌన్, జనవరి 18: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే అందుబాటులో ఉండి అభివృద్ధికి కృషి చేస్తామని షాద్‌నగర్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం పట్టణంలోని పలు వార్డులో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన టీఆర్‌ఎస్‌కు ఎన్నికల్లో గుణపాఠం చెప్పి కాంగ్రెస్‌ను గెలిపించాలని అన్నారు.