రంగారెడ్డి

బీసీ కులాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, నవంబర్ 17: బీసీ కులాల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాల సహకారాన్ని అందిస్తుందని ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం కురుమ గుర్తు చేశారు. నక్క వెంకటమ్మ, యాదగిరి స్వామి యాదవ్ ఫౌండేషన్ సభ్యులు నక్క శ్రీనివాస్ యాదవ్, ఉమేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం ఎల్బీనగర్ యాదవ కుటుంబ సభ్యులకు కార్తీక మాస వనభోజన మహోత్సవాన్ని వనస్థలిపురం ఆటోనగర్ జింకల పార్కులో ఏర్పాటు చేశారు. గొల్లకురుమ కులస్థులు రాజకీయంగా, ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి సాధించాలని చెప్పారు. నక్క సోదరులు ఇలాంటి చక్కటి కార్యక్రమన్ని ఏర్పాటుచేసి కుల బాంధవులను ఒక్కతాటిపై చేర్చడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఏడాది ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటుచేసి యాదవులను చైతన్యం చేసి వారి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. నక్క శ్రీనివాస్ యాదవ్, ఉమేష్ యాదవ్ మాట్లాడుతూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంతో మంది పేద విద్యార్ధుల ఉన్నత చదువుల కోసం తమ వంతు సహకారాన్ని అందిస్తున్నామని గుర్తుచేశారు. చదువు పట్ల ఆసక్తి కలిగిన యాదవ పేద విద్యార్ధులకు ఎలాంటి సహాయం చేయడానికైనా తాము ముందుంటామని గుర్తు చేశారు. నక్క ఎడ్యుకేషన్, అండ్ స్పోర్డ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో యాదవలు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు అరిగెల నాగేశ్వర్‌రావు, క్యామ మల్లేశం, వర్తమాన సినీ నిర్మాత నక్క రాహుల్ యాదవ్, ఎంబీ.కృష్ణ యాదవ్, రాజేష్ యాదవ్, అంజి యాదవ్, చింతల సురేందర్ యాదవ్, పీ.ఈశ్వరమ్మ యాదవ్, గోవర్దన్ యాదవ్ పాల్గొన్నారు.