రంగారెడ్డి

కొనసాగుతున్న నగర శుద్ధీకరణ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, నవంబర్ 11: బోడుప్పల్ పట్టణంలో శుద్ధీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి పిలుపు మేరకు టీఆర్‌ఎస్ నేతలు పోటా పోటీగా వార్డులలో విస్తృతంగా పర్యటిస్తూ సమస్యలను తెలుసుకుంటూ అధికారుల దృష్టికి తీసికెళ్లి పరిష్కరిస్తున్నారు. టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి పులకండ్ల జంగారెడ్డి ఆధ్వర్యంలో నేతలు నత్తి మైసయ్య, బందారపు నాగేశ్వర్ గౌడ్, సురేందర్ రెడ్డి, పవన్ కుమార్, చింతల శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి రెడ్డి, పాపిరెడ్డి, ధర్మవతి, విజయలక్ష్మి కాలనీలలో జేసీబీ సహాయంతో ఖాళీ ప్లాట్లలో చెత్త చెదారాన్ని తొలగిస్తూ పరిసరాలను శుభ్రం చేస్తూ ప్రజల మన్నలను పొందుతున్నారు. కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసికెళ్లి పరిష్కరించడం అభినందనీయం.

శివానగర్ వెల్ఫేర్ అసోసియేషన్
అధ్యక్షుడిగా రత్నేశ్వర్ రావు
జీడిమెట్ల, నవంబర్ 11: గాజులరామారం సర్కిల్ పరిధిలోని జగద్గిరిగుట్ట డివిజన్ శివానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కే.రత్నేశ్వర్ రావు ఎన్నికయ్యారు. శివానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా రత్నేశ్వర్ రావు, ఉపాధ్యక్షుడిగా లింగారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జమాల్ బాషా, సంయుక్త కార్యదర్శిగా అనిత, కోశాధికారిగా రామకృష్ణ ఎన్నికయ్యారు. బస్తీలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటీ వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని అధ్యక్షుడు హామీ ఇచ్చారు.