రంగారెడ్డి

పెయింటింగ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్వాల్, అక్టోబర్ 13: అల్వాల్ పరిధిలోని పెయింటింగ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తున్నామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు చెప్పారు. ఆదివారం అల్వాల్‌లో జరిగిన పేయింటింగ్ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్నారు. చేతివృత్తులపైన ఆధారపడి ఉన్న వారికి ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందించటానికి చర్యలు తీసుకొని వారి సంక్షేమానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నూతనంగా ఎంపికైన కార్యవర్గాన్ని అభినందించారు. అధ్యక్షుడుగా కే.ప్రవీణ్, కార్యదర్శిగా కోమురయ్య, సభ్యులుగా శంకర్, మధుబాబులు ఎంపికైనారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు చింతల మాణిక్య రెడ్డి, దేవెందర్, జనార్ధన్, గణేష్ , మల్లేష్ పాల్గొన్నారు
సమాజ సేవలో యువత ముందుండాలి
శేరిలింగంపల్లి, అక్టోబర్ 13: సమాజ సేవలో యువత ముందుండి ఆదర్శవంతంగా నిలవాలని మాదాపూర్ కార్పొరేటర్, శ్రీకృష్ణ యూత్ వ్యవస్థాపకులు వాలిదాస్ జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం నల్లగండ్లలో శ్రీకృష్ణ యూత్ 19వ నూతన కమిటీని ఎన్నుకున్నారు. యువతను సన్మార్గంలో నడిపించాలనే లక్ష్యంతో 2001లో స్థాపించిన శ్రీకృష్ణ యూత్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కార్పొరేటర్ జగదీష్ ప్రశంసించారు. 19వ నూతన కమిటీ అధ్యక్షునిగా కే.రేవంత్, కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఆర్.సురేందర్ రెడ్డి, పీ.జయసాయి, టీ.మల్లిఖార్జున్, ఉపాధ్యక్షులుగా పీ.విష్ణువర్ధన్ రెడ్డి, బీ.సురేందర్, ప్రధాన కార్యదర్శులుగా వీ.నాగరాజు, పీ.మోహన్ రెడ్డి, టీ.మోహన్ రాజ్, కోశాధికారిగా ఎం.బాలకృష్ణ, కార్యవర్గం, కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, న్యా య సలహాదారు నాగరాజు, గౌరవ అధ్యక్షులు పీ.యాదగిరి, లక్ష్మణ్, బాలరాజు, ప్రదీప్, భాస్కర్, సాయి కుమార్ పాల్గొన్నారు.