రంగారెడ్డి

దాతల సాయంతో పార్కుల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, సెప్టెంబర్ 17: గ్రామాల్లో పార్కు స్థలాల్లో ఎవెన్యూ ప్లాంటేషన్‌తో పాటు దాతల సాయంతో వాటిని అభివృద్ధి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టర్ మేడ్చల్ మండలంలోని రాజబొల్లారం తండా గ్రామాన్ని మా ఊరు 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా ఆకస్మికంగా పర్యటించి గ్రామంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి పార్కు, స్థలాన్ని వెంటనే కేటాయించాలని స్థానిక తహశీల్దార్ వెంకట్ రెడ్డిని ఆదేశించారు. గ్రామంలో మిషన్ భగీరథ పథకంలో భాగంగా బిగించిన కుళాయిలను తీసివేసిన ఇళ్లను పరిశీలించారు. మిషన్ భగీరథ నల్లాకు ఆన్ ఆఫ్ లేవని వెంటనే ప్రతీ ఇంటికి ఆన్ ఆఫ్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించేంత వరకు ఉన్న డ్రైనేజీ వ్యవస్థను పరిశుభ్రంగా ఉంచుకుని ఎప్పటికప్పుడు బ్లీచింగ్, ఫాగింగ్ చేయాలని సూచించారు. పాఠశాల భవనంలో రెండు గదులు శిథిలావస్థలో ఉన్నాయని గ్రామస్థులు విన్నవించగా కలెక్టర్ వెంటనే స్పందించి శిథిలావస్థలో ఉన్న గదులను తొలగించి కొత్త వాటిని నిర్మించేందుకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారిని ఆదేశించారు.
ఎండిపోయిన మొక్కలు: కలెక్టర్ ఆగ్రహం
గ్రామంలో హరితహారంలో భాగంగా రోడ్డుకు ఇరుపక్కల నాటిన మొక్కలు కొన్ని చనిపోయాయని వాటి స్థానంలో మరో మొక్కను నాటనందుకు, మొక్కలు ఎండిపోయినా పట్టించుకోనందుకు కలెక్టర్ సర్పంచ్, కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ పంచాయతీ సెక్రటరీల నుండి మొక్కలకు అయ్యే ఖర్చును రికవరీ చేసి మరో మొక్కను నాటాలని సూచించారు. వెంటనే ఏజన్సీ వాళ్లను పిలిచి మొక్కలను నాటించాలని అన్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న వైకుంఠ ధామాన్ని కలెక్టర్ సందర్శించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ దేవసహాయం, కీసర డివిజన్ ఆర్డీఓ లచ్చి రెడ్డి, డీపీఓ రవికుమార్, ఇరిగేషన్ అధికారి మంజుల, తహశీల్దార్ వెంకట్ రెడ్డి, ఎంపీడీఓ పద్మావతి తదితర శాఖల అధికారులు, స్థానిక సర్పంచ్ మంగ్యా నాయక్ పాల్గొన్నారు.

అడవి పందుల బారిన పంటలు
కులకచర్ల, సెప్టెంబర్ 17: అడవి పందుల బారిన పడి పంటలు దెబ్బతింటున్నాయని పలువురు రైతులు వాపోతున్నారు. ఏపుగా పెరిగిన పంట పొలాల్లోకి రాత్రి కాగానే అడవి పందులు గుంపులు గుంపులుగా వచ్చి పడుతున్నాయని తిన్నకాడికి తిని మిగతా పంటను తొక్కి తొక్కి పాడుచేస్తున్నాయని వాపోయారు. ఇప్పపల్లె, రాంపురం, అనంతసాగర్ తదితర గ్రామాల్లో మొక్కజొన్న పంటలను దాదాపుగా పెద్ద ఎత్తున ధ్వంసం చేస్తున్నాయి. కాపాల ఉందామంటే పులి తిరుగుతున్నట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని పంటలను కాపాడుకోవాలంటే కాపాలా ఉండాలని, మరోవైపు రాత్రి వేళల్లో పొలాల దగ్గర కాపాల ఉండేందుకు ఉత్సుకత చూయించరాదని అటవీశాఖ వారి హెచ్చరికల నేపథ్యంలో ఏమి చేయాలో పాలు పోవడం లేదని పలువురు రైతులు వాపోతున్నారు. పంటలను కాపాడుకునేందుకు కంచెలు ఏర్పాటు చేసుకున్నా వాటిని దాటేసి వస్తున్నాయని, విద్యుత్ షాక్ పెడితే పశువులు, మనుషులు ఉదయం వేళల్లో సంచరిస్తుంటాయని, ఈ భయానికి విద్యుత్ షాక్ పెట్టడం లేదని తెలిపారు. ఈ విషయంలో సరైన చర్యలు తీసుకునేలా చూడాలని పలుమరు రైతులు కోరుతున్నారు.