రంగారెడ్డి

విశ్వకర్మ మహోత్సవ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, సెప్టెంబర్ 17: శ్రీ విశ్వకర్మ భగవానుని కన్యా సంక్రమణ పర్వదినాన్ని మైలార్‌దేవ్‌పల్లి శాంతినగర్‌లో ఘనంగా నిర్వహించారు. సోమవారం శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగా వైభవంగా నిర్వహించారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు. మధుసూదనాచారి, స్వామిగౌడ్ మాట్లాడుతూ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని బోధించిన మహాజ్ఞాని అని కొనియాడారు. విశ్వకర్మ భగవానుడు చేసిన ప్రబోధలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. మనిషి జీవితంలో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో అతని బోధనల ద్వారా తెలిపిన మహిమాన్వితుడని కొనియాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేతి వృత్తులకు తగిన ప్రాధాన్యతను కల్పిస్తుందని తెలిపారు. కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి, అత్తాపూర్ డివిజన్ కార్పొరేటర్ రావుల విజయ జంగయ్య పాల్గొన్నారు.
తలకొండపల్లి: మండలంలో మంగళవారం విశ్వకర్మ జయంతి ఉత్సవాలను ఆ సంఘం నాయకులు స్థానిక కాళికామాత ఆలయంలో ప్రత్యేక పూజలు, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మండల అధ్యక్షుడు నర్సింహా చారి మాట్లాడుతూ పూర్వకాలంలో గ్రామీణ ప్రాంతాలలోని ఎన్నో కుటుంబాలు కుల వృత్తులను నమ్ముకొని కాలం గడిపేవారని ఆయన అన్నారు. ప్రస్తుతం నేటి సమాజంలో కుల వృత్తులు కంటి చూపుమెరలో కానరాకుండా పోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాలలోని కులవృత్తులను నమ్ముకొని జీవనం సాగిస్తున్న వారికి ప్రభుత్వం రాయితీలు కల్పించి బాసటగా నిలవాలని ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను కోరారు. స్థానిక సర్పంచ్ లలితజ్యోతయ్య, మాజీ జడ్పీటీసీ నర్సింహా, ఓంకారం, రాజు, వెంకటయకర్మ శ్రీనివాసా చారి, రమాకాంత్, రమేష్, శ్రీ్ధర్, భానుమూర్తి, కృష్ణయ్య పాల్గొన్నారు.
షాద్‌నగర్ రూరల్: విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం షాద్‌నగర్ పట్టణంలోని విశ్వకర్మలు ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ఫరూఖ్‌నగర్ విశ్వకర్మ దేవాలయంలో సామూహిక యజ్ఞం నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం దేవాలయం ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వేణుగోపాలచారి, యాదయ్యచారి, అమృతచారి, భాస్కరచారి, నర్సింహాచారి, మాధవచారి, రాజుచారి పాల్గొన్నారు.
కీసర: శ్రీ విశ్వకర్మ జయంతి యజ్ఞమహోత్సవం మంగళవారం నాగారం మున్సిపల్ పరిధిలోని జీఆర్‌ఎస్‌ఎస్ ఫంక్షన్ హాల్‌లో వేద పండితులు ఘనంగా నిర్వహించారు. కీసర మండల విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో యజ్ఞ మహోత్సవంలో విశ్వకర్మ కులస్థులు పాల్గొని విజయవంతం చేసారు. తెలంగాణ మాజీ స్పీకర్ మధుసూధనాచారి హోమంలో పాల్గొన్నారు. అనంతరం మధుసూధనాచారిని శాలువాతో సత్కరించి, మెమోంటోను అందజేసారు. అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంబీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు కాలప్ప, బీజేపీ జాతీయ నాయకులు సత్యనారాయణ, భోగారం ఎంపీటీసీ వెంకట్ రెడ్డి, విశ్వకర్మ కులస్థులు వెంకటాచారి, కీసర ప్రభాకరచారి, రవీందర్, రాము, చంద్రవౌళి, శ్రీనివాస్, రాఘవేందర్, అనంతాచారి, కీసరి సుదర్శనాచారి, నర్సింహాచారి, అశోక్ పాల్గొన్నారు.
బాలానగర్: ఫీరోజ్‌గూడ అయ్యప్ప స్వామి ఆలయంలో విశ్వకర్మ వెల్ఫేర్ సోసైటి (కేరళ) వారు నిర్వహించిన విశ్వకర్మ జయంతి ఉత్సవాలకు బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ కాండూరీ నరేంద్ర ఆచార్య పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో రఘునాధన్, కుమారి, ఉన్ని కృష్ణన్, జయరాతుల చారి, రెడప్పచారి, బాలాకృష్ణాచారి, నవీన్ ప్రసాద్‌చారి, నాగరాజు చారి, యాదగిరి, నాగేందర్ గౌడ్, శ్రీనివాస్ ముదిరాజ్, ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.
మేడ్చల్: విశ్వకర్మ జయంతిని మంగళవారం మేడ్చల్‌లో నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద విశ్వకర్మ చిత్రపటానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
పరిగి: విశ్వకర్మ జయంతిని పరిగిలో మంగళవారం ఘనంగా విశ్వకర్మీయులు జరుపుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో విశ్వకర్మపూజలు ఘనంగా చేశారు. యజ్ఞం కార్యక్రమం నిర్వహించారు. అన్నదానం కార్యాక్రమం నిర్వహించారు. పరిగి మండల జడ్పీటీసి సభ్యురాలు హరిప్రియ ప్రవీణ్‌కుమార్ రెడ్డిని శాలువలతో సన్మానించారు. టీఆర్‌ఎస్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, అంతిగారి సురేందర్, అంజనేయులు పాల్గొన్నారు.
జీడిమెట్ల: విశ్వ బ్రాహ్మణులకు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని కుత్బుల్లాపూర్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కడియాల రామాచారి అన్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని పద్మానగర్ రింగ్ రోడ్డులో విశ్వకర్మ జయంతి వేడుకలను స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ యజ్ఞం నిర్వహించి, జెండాను ఆవిష్కరించారు. రామాచారి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్ 17న సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్, స్వర్ణకార సంఘం సభ్యులు సీహెచ్ శ్రీనివాస్, వెంకట్రామయ్య, శ్రీనివాస్ చారి, రాజు, రవికుమార్, వేణుగోపాల్ చారి పాల్గొన్నారు. అయోధ్యనగర్‌లో విశ్వకర్మ జయంతి వేడుకలను విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీఆర్‌ఎస్ నేత కేఎం ప్రతాప్ విచ్చేసి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో పూజలు చేసి అన్నదానాన్ని ప్రారంభించారు. నాయకులు సుభాష్, సత్యనారాయణ, అంజయ్య, ప్రభాకర్, సంగమేశ్వర్ పాల్గొన్నారు.