రంగారెడ్డి

రైతులకు అందుబాటులో యూరియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాచారం, సెప్టెంబర్ 16: రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉన్నదని, రైతులు ఆందోళన చెందవద్దని వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు సత్యనారాయణ, మండల వ్యవసాయాధికారి సందీప్‌కుమార్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని ఎరువుల దుకాణాలను అకస్మిక తనిఖీ చేశారు. ఖరీఫ్‌కు 280 మెట్రిక్ టన్నుల యూరియా అవసరముండగా ఇప్పటికే 195 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు తెలిపారు. రైతులకు మరో 45 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నదని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
జాతీయ స్థాయి పోటీలకు కృష్ణ యాదవ్
మేడ్చల్, సెప్టెంబర్ 16: తెలంగాణ మాస్టర్స్ అంతర్ జిల్లా స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో మండలంలోని రావల్‌కోల్ గ్రామానికి చెందిన యువకుడు ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఆదివారం జరిగిన పోటీల్లో అంతర్ జిల్లా స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో రావల్‌కోల్ గ్రామానికి చెందిన మామిండ్ల కృష్ణ యాదవ్ ఒక వెండి పతకం, రెండు రజత పతకాలు సాధించి, లక్నోలో జరుగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. సోమవారం కృష్ణ యాదవ్‌ను గ్రామంలో పలువురు అభినందించారు.

ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా ఇన్‌చార్జిగా శంకర్ నాయక్
మేడ్చల్, సెప్టెంబర్ 16: లంబాడీ హక్కుల పోరాట సమితి మేడ్చల్ జిల్లా ఇన్‌చార్జిగా బోడుప్పల్‌కు చెందిన శంకర్ నాయక్ నియమితులయ్యారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు తేజవత్ బెల్లయ్య నాయక్ సమక్షంలో శంకర్ నాయక్‌ను జిల్లా ఇన్‌చార్జిగా రాష్ట్ర సంఘం కార్యదర్శిగా నియమించారు. శంకర్ నాయక్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలను నెరవేస్తూ సంఘం పటిష్టతకు కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూక్యా కొటీయ నాయక్, కైలాస్ నాయక్, షెడ్యుల్ ట్రైబ్స్ ఫెడరేషన్ ఎస్టీఎఫ్ ఉద్యోగ సంఘం అధ్యక్షులు ఇస్లావత్ కాళే నాయక్, మల్లారెడ్డి పాల్గొన్నారు.

లయన్స్ క్లబ్ ఆసుపత్రికి
అధునాతన వైద్య పరికరం అందజేత
కుషాయిగూడ, సెప్టెంబర్ 16: పేద ప్రజలకు ఉచిత వైద్య సేవాలు చేయడానికి లయన్స్ క్లబ్ ముందుంటుందని మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు అన్నారు. కుషాయిగూడ లయన్స్ క్లబ్ ఆసుపత్రి ట్రస్ట్‌కు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ చైర్మన్ కొత్త రామారావు ఆల్ట్రా సోనోగ్రాఫీ వైద్య పరికరం అందజేశారు. కుషాయిగూడ లయన్స్ క్లబ్ పేద ప్రజలకు ఉచిత వైద్యసేవాలు అందించడానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. కుషాయిగూడ రౌండ్ బల్డింగ్‌లో లయన్స్ క్లబ్ ఆసుపత్రిలో నిత్యం వందలాది మంది నామామత్రపు ఫీజులుతో వైద్య సేవాలు అందిస్తున్నారని తెలిపారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు కొండ బాల పద్మారావు, నారాయణ స్వామి, వీవీఎస్‌ఎన్ రావు, డాక్టర్ శ్రీకాంత్ రావు పాల్గొన్నారు.
ల్రీడర్ అవార్డు అందుకున్న చంద్రశేఖర్ గౌడ్
వనస్థలిపురం, సెప్టెంబర్ 16: ఎల్బీనగర్ నియోజకవర్గం టీయూ డబ్లూయూజే ఉపాధ్యక్షుడు సంకరి చంద్రశేఖర్ గౌడ్, ది లీడర్ ఆఫ్ 2019 జ్యోతిరావు పూలే అవార్డు అందుకున్నాడు. నగరంలోని ఏవీఎస్ కనే్వన్షన్ హాల్లో ఓబీసీ పీపుల్స్ ఫేడరేషన్ చైర్మన్ చామకూర రాజు ఆధ్వర్యంలో ది లీడర్ ఆఫ్ 2019 ఈ ఆవార్డును చంద్రశేఖర్ గౌడ్‌కు తెలంగాణ మున్సిపాల్ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగన్ మోహన్, జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర నాయకులు అనంతుల శ్రీనివాస్ అందజేసారు.