రంగారెడ్డి

నిరక్షరాస్యులకు న్యాయం అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, ఆగస్టు 17: నిరక్షరాస్యత, పేదరికం వల్ల చాలా మంది న్యాయం పొందలేక పోతున్నారని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి రేణుక యాదవ్ పేర్కొన్నారు. శనివారం కీసర గ్రామంలోని కేబీఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన మహా న్యాయ విజ్ఞాన, సంక్షేమ పధకాల సాధికారత సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
న్యాయమూర్తి రేణుక మాట్లాడుతూ కోర్టుల్లో కేసుల సంఖ్య అధికంగా ఉన్నందున, పరిష్కారానికి అధిక సమయం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు, లోక్ అదాలత్‌ల ద్వారా పరిష్కరించుకునే వెసులుబాటు కల్పించిందని అన్నారు.
పేదలు, నిరక్షరాస్యులు న్యాయం పొందలేక పోతున్నారని, వారికి న్యాయ సహాయం చేసేందుకు జాతీయ న్యాయ సేవాధికార సంస్ధ ఆధ్వర్యంలో అమలు చేయుచున్న అనేక న్యాయ సేవల పధకాల గురించి తెలియజేయటమే సమావేశ ఉద్ధేశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సివిల్ కోర్టు సీనియర్ జడ్జి ఉదయ్ కుమార్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ జడ్జి భవానీచంద్ర, మల్కాజ్‌గిరి కోర్టు అడిషనల్ జడ్జి జయప్రకాశ్, ఎల్భీనగర్ బార్ కౌన్సిల్ అధ్యక్షులు శ్రీనివాస్, మల్కాజ్‌గిరి బార్ కౌన్సిల్ అధ్యక్షులు యాదగిరి, ఎల్భీనగర్ డీసీపీ సందీప్, డీఆర్వో మధుకర్ రెడ్డి, ఆర్డీఒలు లచ్చిరెడ్డి, మధుసూధన్, కీసర సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేశ్ పాల్గొన్నారు.

సీఐ వాహిదుద్దీన్‌ను కలిసిన బీజేపీ నేతలు
జీడిమెట్ల, ఆగస్టు 17: బాలానగర్ సీఐగా వాహిదుద్దీన్ నూతనంగా బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా రంగారెడ్డి నగర్ డివిజన్ బీజేపీ నేతలు కలిశారు. రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు నందనం దివాకర్ ఆధ్వర్యంలో సీఐని శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛాన్ని అందజేసి స్వాగతం పలికారు. బీజేపీ నాయకులు రంగా శ్రీనివాస్ గౌడ్, పరిశె వేణు, నారాయణ పాల్గొన్నారు.
ఏఎస్‌ఐ శ్రీనివాస రావుకు ఉత్తమ సేవా పథకం
ఉప్పల్, ఆగస్టు 17: ఉప్పల్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ కాశీ విశ్వనాధ్‌తో పాటు ఏఎస్‌ఐగా పని చేస్తున్న పీ.శ్రీనివాస రావుకు ఉత్తమ సేవా పథకం లభించింది. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా కలెక్టర్ ఎంవీ రెడ్డి, పోలీసు అధికారులు ఈ పథకాన్ని అందజేసారు. విధి నిర్వహణలో ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ప్రజలకు విశిష్ట సేవలందిస్తున్నందుకు గాను అవార్డు దక్కింది.

శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన ధ్యేయం
తాండూరు, ఆగస్టు 17: శాంతి భధ్రతల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతామని తాండూరు రూరల్ సర్కిల్ నూతన సీఐ డీ.జలంధర్ రెడ్డి పేర్కొన్నారు.
శనివారం రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఫిర్యాదు దారులకు సత్వర న్యాయం చేయటం పోలీస్ ప్రధమ కర్తవ్యం సీఐ వివరించారు. తాండూరు పోలీస్ సభ డివిజన్‌లో మట్కా జూదం, ఇసుక అక్రమ రవాణాలపై ఉక్కు పాదం మోపుతామన్నారు.