రంగారెడ్డి

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, జూన్ 25: ప్రతి నాయకుడు ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేసినప్పుడే ప్రజా నాయకుడిగా గుర్తింపు వస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖల మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. ఘట్‌కేసర్ మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన మంగళవారం జరిగింది. 2014 జులై నాలుగున ఏర్పాటు అయిన మండల పరిషత్ పాలకవర్గం చివరి సర్వసభ్య సమావేశం కావటంతో ఏలాంటి ఏజెండాలపై చర్చించకుండానే సమావేశం నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన మేడ్చల్ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రా రెడ్డి, ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి, వైస్ ఎంపీపీ గ్యార లక్ష్మయ్య, నూతనంగా ఎన్నికైన ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, సహకార సంఘం చైర్మన్ గొంగళ్ల స్వామి, ఇన్‌చార్జి ఎంపీడీఓ సునంద, పాత మండల ఎంపీటీసీలు, నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, అయా శాఖల అధికారులు పాల్గొన్నారు. పదవి కాలం ముగిసిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. నూతనంగా ఎన్నికైన ఎంపీపీ, ఎంపీటీసీలను సన్మానించి స్వాగతం పలికారు. ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతు ఘట్‌కేసర్ మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచి ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. పలువురు ఎంపీటీసీలు మాట్లాడుతు సభ్యులను ఉత్సవ విగ్రహాలుగా గాకుండా ప్రత్యేక నిధులు ఇచ్చి గౌరవించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి మల్లారెడ్డిని కోరారు. సమావేశ అనంతరం మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, జడ్పీ చైర్మన్‌గా ఎన్నికైన శరత్‌చంద్రా రెడ్డి, సభ్యులను సన్మానించారు. ఎంపీటీసీలు వేముల నాథం గౌడ్, బేతాల నర్సింగ్ రావు, నానావత్ బిక్కునాథ నాయక్ పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను
కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దాలి
ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖల మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మండల పరిధి చౌదరిగూడ, కొర్రెముల, అన్నోజిగూడ, మక్త, సాదత్ అలీగూడ గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో భాగంగా మంత్రి మల్లారెడ్డి పాఠశాలలను సందర్శించారు. మంగళవారం చౌదరిగూడ సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్ మంత్రి మల్లారెడ్డి సోంత ఖర్చులతో నోట్ పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు. నోట్ పుస్తకాల పంపిణీకి సహకరించిన సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్‌ను మంత్రి అభినందించారు. ప్రతి ఒక్కరికి నాణ్యత కలిగిన విద్యను అందించటమే లక్ష్యంగా మోడల్ పాఠశాలలను ఏర్పాటు చేసి కార్పొరేట్ విద్యను ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యా, వైద్యం, ఉపాధిని ప్రతి ఒక్కరికి అందించటమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు. అన్నోజిగూడ ప్రభుత్వ పాఠశాలకు తమ వంతు సహయంగా రెండు లక్షలు విరాళంగా అందజేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి నాయకుడు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నిరంతరం కృషి చేసి వంద శాతం అక్షరాస్యతను సాధించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. వంద శాతం ఉత్తీర్ణతను సాధించి జిల్లాకే ఆదర్శంగా అన్నోజిగూడ ప్రభుత్వ పాఠశాల నిలిచిందని చెప్పారు. ప్రతి విద్యార్ధి పట్టుదల, క్రమ శిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. తల్లిదండ్రులు కన్న కలలను సాకారం చేసేందుకు నిరంతర కృషి చేయాలని విద్యార్ధులకు సూచించారు. అనంతరం అన్నోజిగూడ గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి, మండల విద్యాధికారి నర్సింహా రెడ్డి, కొర్రెముల సర్పంచ్ ఓరుగంటి వెంకటేశ్ గౌడ్, చౌదరిగూడ సర్పంచ్ బైరు రమాదేవి, మాజీ సర్పంచ్‌లు బైరు రాములు గౌడ్, నక్క వరలక్ష్మి, లక్ష్మణ్ గౌడ్, ఎంపీటీసీ భాస్కర్ గౌడ్, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు బోయపల్లి కొండల్‌రెడ్డి, కీసరగుట్ట ఆలయ కమిటీ మాజీ డైరక్టర్ తరిణే మహింధ్రా చారి, పంచాయతీ సభ్యులు బోజిరెడ్డి, నర్సింగ్ రావు, సుధాకర్, లింగం యాదవ్ పాల్గొన్నారు.