రంగారెడ్డి

పోలేపల్లి ఎల్లమ్మ దేవత దర్శనానికి పోటెత్తిన భక్తజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొంరాస్‌పేట, జూన్ 25: మహిమాన్వీతమైన మావురాల ఎల్లమ్మతల్లీ దర్శనానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే అమ్మవారి దర్శనం కోసం బారులుతీరారు. కోరిన కోర్కేలు తీరిన భక్తులు బియ్యం పోసి కానుకలు సమర్పించారు. బోనాలుతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి నైవేథ్యం సమర్పించగా, కొందరు శరీరమంత వేపాకు చుట్టుకొని తలపై అమ్మవారికి సమర్పించేందుకు నైవేథ్యంతో తరలివచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం జనంతో కిక్కిరిసింది.
మున్సిపల్ ఎన్నికలకు సమాయాత్తం
మేడ్చల్, జూన్ 25: కాంగ్రెస్ శ్రేణులు త్వరలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికలకు సమాయాత్తం కావాలని ఏఐసీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్ పిలుపునిచ్చారు. మంగళవారం మేడ్చల్, గుండ్లపోచంపల్లి మున్సిపల్ నాయకులతో పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కేఎల్‌ఆర్ మాట్లాడుతూ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నందున ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని సూచించారు. మేడ్చల్, గుండ్లపోచంపల్లి మున్సిపల్స్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేసే విధంగా అభ్యర్థులను తయారు చేయాలని పిలుపునిచ్చారు. మేడ్చల్ పెద్ద చెరువు కట్టపై నిర్వహించిన రేణుకా ఎల్లమ్మ తల్లి కల్యాణమహోత్సవంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తరించారు. కార్యక్రమంలో నాయకులు వరదా రెడ్డి, వేముల శ్రీనివాస్ రెడ్డి, బీ.నరేందర్, పోచయ్య, కృష్ణ, సద్ధి సంజీవ రెడ్డి, ప్రకాశ్ రెడ్డి, రాజు, నాగభూషణం, హేమంత్ రెడ్డి, శ్రీనివాస్, సుధాకర్, యూసుఫ్, ఆరీఫ్, బాల్‌రెడ్డి, బాపురెడ్డి పాల్గొన్నారు.

ఎన్నికలకు సిద్ధంగా ఉండేలా ముందస్తు ప్రక్రియ ప్రారంభం
ఉప్పల్, జూన్ 25: పురపాలక సంచాలకులు డాక్టర్ టీకే శ్రీదేవి ఆదేశాల ప్రకారం బోడుప్పల్ పురపాలక సంఘం పరిధిలో రిజర్వేషన్ల ఖరారుకు ప్రాతిపదికగా భావించే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండేలా ముందస్తుప్రక్రియను ప్రారంభించారు. మున్సిపల్ సూపర్‌వైజర్లు, బిల్‌ఓలు డోర్ టూ డోర్ సర్వే చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేశారు. ఓటరు జాబితా ఆధారంగా పోలింగ్ కేంద్రాల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియను జూలై నాలుగో తేదీలోగా పూర్తి చేయాల్సింది. జూలై5న జాబితా సిద్ధం చేసి 6న ముసాయిదా ప్రకటించాల్సి ఉంటుంది. దీనిపై జూలై 11వరకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించాలి, జూలై 16వరకు పరిశీలన ప్రక్రియను పూర్తి చేసి, 17వ తేదిన ఓటర్ల జాబితా, 18న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. జాబితాను పురపాలక శాఖ సంచాలకులకు జూలై19న పంపిస్తే ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ ప్రక్రియకు పురపాలక సంఘం పరిధిలోని ప్రజలు సహాయ సహకారం అందించి, ఓటర్లకు అవగాహన కల్పించి సకాలంలో పూర్తి చేయడానికి సహకరించాలని కమిషనర్ ఉపేందర్ రెడ్డి కోరారు.