రంగారెడ్డి

టీఆర్‌ఎస్‌కు ప్రత్నామ్యాయం బీజేపీనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, జూన్ 25: నియంతృత్వ ధోరణితో పాలన కొనసాగిస్తున్న టీఆర్‌ఎస్‌కు తెలంగాణలో ప్రత్నామ్యాయం బీజేపీయేనని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కే.లక్ష్మణ్ అన్నారు. మంగళవారం ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగ్లూరు గ్రామ సమీపంలోని ప్రమిద గార్డెన్స్‌లో టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు పొట్టి రాములుతో పాటు రెండు వేల మంది కార్యకర్తలు భీజపీలో చేరారు. బీజపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్త అశోక్ గౌడ్, జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జీ జనార్ధన్ రెడ్డి, బోసుపల్లి ప్రతాప్, పోరెడ్డి నర్సింహా రెడ్డి, పోరెడ్డి అర్జున్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జీ నాయిని సత్యనారాయణ, దనె్న బాషయ్య, శ్రీశైలం, రాఘవేందర్, సురంపల్లి కాళిదాస్, మొగిలి గణేశ్ పాల్గొన్నారు.

పుట్టిన ఊరుకు సేవ చేయడం గర్వకారణం
శేరిలింగంపల్లి, జూన్ 25: పుట్టిన ఊరుకు సేవ చేసే భాగ్యం కలిగినందుకు గర్వకారణంగా భావిస్తున్నానని ఉత్తమ కార్మిక నాయకుడు అవార్డు గ్రహీత, బొబ్బ ఛారిటబుల్ ట్రస్టు చైర్మన్ బొబ్బ విజయ్ రెడ్డి అన్నారు. చందానగర్‌కు చెందిన విజయ్ రెడ్డి మంగళవారం తన స్వగ్రామమైన ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలంలో గల దుంపిల్లగూడెంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం పాఠ్య పుస్తకాలు, తెలుగు, ఆంగ్ల మాధ్యమాల విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిల్లు, ఆట వస్తువులు అందజేశారు. ప్రజా ప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ప్రధాన ఉపాధ్యాయులు, నాయకులతో కలిసి విద్యార్థులకు పుస్తకాలు, సామాగ్రి పంపిణీ చేశారు. ఎనిమిదేళ్లుగా ఒకటోతరగతి నుంచి ఐదోతరగతి వరకు ఇంగ్లీష్ మీడియం పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఆరోతరగతి నుంచి పదోతరగతి వరకు ఉన్న విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్లు, ఆట వస్తువులు పంపిణీ చేస్తున్నానని తెలిపారు. బొబ్బ విజయ్‌రెడ్డిని ప్రజా ప్రతినిధులు, విద్యాధికారులు, అభినందించారు. కార్యక్రమంలో పార్నంది శ్రీకాంత్, పోచయ్య, సలీం పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను నిర్మించుకోవాలి
షాద్‌నగర్ రూరల్, జూన్ 25: గ్రామంలోని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మరుగుదొడ్లను నిర్మించుకోవాలని విఠ్యాల సర్పంచ్ జయశ్రీ చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం ఫరూఖ్‌నగర్ మండలం విఠ్యాల గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించారు. గ్రామం అభివృద్ధి చెందాలంటే ముందు ప్రతి ఒక్కరు మరుగుదొడ్లను నిర్మించుకోవాలని పేర్కొన్నారు. బహిరంగ మలమూత్ర విసర్జనతో అంటురోగాలు, వివిధ రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు. మరుగుదొడ్ల నిర్మాణాల కోసం ప్రభుత్వమే రూ.12వేల ఆర్థికసాయాన్ని అందజేస్తుందని తెలిపారు. సీసీ శివకుమార్, పంచాయతీ కార్యదర్శి రాజేందర్, వీఆర్‌వో ఆంజనేయులు, వీఓఏ మోయినోద్దీన్, నాయకులు వహాబ్, లింగం, వెంకటేష్, యాదయ్య పాల్గొన్నారు.