రంగారెడ్డి

శ్రీరేణుకా ఎల్లమ్మ కల్యాణోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జూన్ 25: బోడుప్పల్ టెలీఫోన్ కాలనీలో శ్రీరేణుకా ఎల్లమ్మ ఆలయ ప్రధమ వార్షికోత్సవంలో భాగంగా మంగళవారం తల్లి కల్యాణం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. వేద పండితుల మంత్రోశ్ఛరణలు, మంగళ వాయిధ్యాల మధ్య జరిగిన వేడుకల్లో మంత్రి మల్లా రెడ్డి, జడ్పీటీసీ మంద సంజీవ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ సామల బుచ్చిరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు చర్ల ఆంజనేయులు, రాపోలు వీరారెడ్డి, జడిగె రమేశ్, జే.రాములు, కాలనీ ప్రజలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి మహిళలు బోనాలతో ర్యాలీగా వచ్చి తల్లికి నైవిద్యం సమర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి
వికారాబాద్, జూన్ 25: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా వ్యవహరించి పోలీస్ వ్యవస్థపై వారికి నమ్మకాన్ని కలుగజేయాలని జిల్లా అదనపు ఎస్పీ ఆర్.్భస్కర్ అన్నారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్సు హాలులో రిసెప్షన్ కానిస్టేబుళ్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఫిర్యాదుదారులు చదువురాని వారు స్టేషన్‌కు వస్తే ఫిర్యాదు రాసి వినిపించి పైఅధికారులకు తెలియజేయాలని అన్నారు. ఫిర్యాదును సంబంధిత అధికారులు వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఫిర్యాదు దారు ఫోన్‌కు మెసేజ్ రూపంలో పంపాలని తెలిపారు. ఫిర్యాదు దారుకు వెంటనే రశీదు సైతం ఇచ్చి వారికి భరోసా కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో డీఎస్‌బీ ఇన్‌స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, సీతయ్య ఉన్నారు.
అన్ని కాలనీలను అభివృధ్ది చేస్తా
హయత్‌నగర్, జూన్ 25: ఎన్నికల్లో ఇచ్చిన హామి ప్రకారం ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని అన్ని కాలనీలను అభివృధ్ది చేస్తానని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. హయత్‌నగర్ డివిజన్‌లో రూ.1.22కోట్లతో చేపట్టిన అభివృధ్ది పనులకు మంగళవారం కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని కాలనీలను సమగ్రంగా అభివృధ్ధి చేసేందుకు శక్తివంచన లేకుండ కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో చెన్నగోని శ్రీ్ధర్ గౌడ్, శర్మ, జగన్, లక్ష్మణ్, చంద్రారెడ్డి, భాను, ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు.