రంగారెడ్డి

ఘనంగా రథ సప్తమి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్: అనంతగిరిలోని శ్రీఅనంత పద్మనాభ స్వామి ఆలయంలో మంగళవారం రథ సప్తమి వేడుకలను ఆలయ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. స్వామివారిని సప్త వాహనాలపై ఆలయ వీధుల్లో ఊరేగించారు. వాహన సేవలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఎం.ఆనంద్ దంపతులు, సీఐ సీతయ్య, పలువురు ప్రముఖులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో శేఖర్ గౌడ్, కార్యదర్శి శాంతకుమార్, ఆలయ అర్చకులు సీతారామాచార్యులు, శేషగిరి పంతులు ఉన్నారు.
షాద్‌నగర్ రూరల్: రథసప్తమిని పురస్కరించుకొని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సోమవారం రథసప్తమి సందర్భంగా ఫరూఖ్‌నగర్ మండలం ఉత్తర రామలింగేశ్వర స్వామి దేవాలయం భక్తులతో నిండిపోయింది. ఆలయంలో ఉన్న శివపార్వతులు, శివలింగం, విఘ్నేశ్వర స్వామికి ప్రత్యేకంగా అభిషేకాలు చేశారు. రథసప్తమి సందర్భంగా ఉత్తర రామలింగేశ్వర స్వామి దేవాలయంలో తెల్లవారుజాము నుండే భక్తుల తాకిడి ఎక్కువగానే పెరిగిపోయింది. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకొని శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. షాద్‌నగర్ పురపాలక సంఘం జానంపేటలో ఉన్న శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శంచుకునేందుకు తెల్లవారుఝాము నుండే భక్తులు తరలివెళ్లారు. రథసప్తమి సందర్భంగా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పలు సేవలు నిర్వహించారు. కన్యకాపరమేశ్వరీ ఆలయం, శివమారుతి గీతా అయ్యప్ప మందిరం, రమా సత్యనారాయణ స్వామి దేవాలయం, ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట శివారులో ఉన్న శ్రీ్భవాని మాత దేవాలయంలో రథసప్తమి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
కులకచర్ల: ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మికత పెరిగితే కొంతమేరకు తప్పులు చేయకుండా ఉండేందుకు అవకాశం వుందని పరిగి శాసనసభ్యుడు కొప్పుల మహేష్‌రెడ్డి అన్నారు. మంగళవారం కులకచర్ల మండలం పుట్టపహాడ్‌లో సీతారామ కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ప్రతి ఏడాది ఇక్కడ మాఘమాసంలో ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. రథసప్తమి సందర్భంగా రాములోరి కల్యాణోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్ని పూజలు నిర్వహించారు. దైవ చింతన కారణంగా మనిషిలో ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ ఛైర్మన్ రుద్రారెడ్డి, మాజీ ఎంపీటీసీ ఎంకన్న, రమేశాచార్యులు పాల్గొన్నారు.
కొడంగల్: శ్రీమహాలక్ష్మి వేంకటేశ్వర స్వామి దేవాలయంలో రథ సప్తమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ సలహాదారుడు సుందర వరద భట్టాచార్యుల సలహా మేరకు ఒక్కరోజు బ్రహ్మోత్సవంలా వేడుకలు జరిపారు. వేడుకలలో భాగంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి సప్త వాహనాలపై స్వామివారి ఉత్సవ మూర్తులను అంగరంగ వైభవంగా అలంకరించి మాడవిధుల గుండా ఊరేగుతూ భక్తులకు ప్రత్యేక దర్శనమిచ్చారు. ఉత్సవ వేడుకలకు పలు ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వచ్చిన భక్తులకు తీర్ధప్రసాదాలను అందజేశారు. కర్ణాటక సరిహద్దులో ఉన్న మోత్కుపల్లి బలభీమసేన ఆలయంలో కూడా రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
తలకొండపల్లి: రథసప్తమి సందర్భంగా మండలంలోని దేవాలయాలు మంగళవారం భక్తులతో కిటకిటలాడాయి. తలకొండపల్లి మండల కేంద్రంతోపాటు చుక్కాపూర్‌లో శ్రీచెన్నకేశవస్వామి దేవాలయాలలోని కల్యాణోత్సవాలు కన్నుల పండువగా కొనసాగాయి. తలకొండపల్లిలోని దేవాలయంలో కల్యాణోత్సవంలో అమృతం ప్రకాష్ - భాగ్య, మల్లేష్ - పద్మ, చుక్కాపూర్ దేవాలయంలోని కల్యాణోత్సవంలో పూజారి వెంకటేశ్వరశర్మ-సీతమ్మ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్యాణోత్సవానికి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జడ్పీటీసీ నర్సింహా, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, మండల రైతు సమన్వయ సంఘం కన్వీనర్ దశరథ్ నాయక్ పాల్గొన్నారు.